అన్వేషించండి

Chiranjeevi : 'సైరా' వల్ల భారీగానే నష్టపోయాం - ఆ సినిమాకి గొప్ప పేరొచ్చింది, కానీ డబ్బులు రాలేదు : చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజా ఇంటర్వ్యూలో 'సైరా నరసింహారెడ్డి' ఫెయిల్యూర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైరా సినిమా వల్ల భారీగానే నష్టపోయామని స్వయంగా ఒప్పుకున్నారు.

Chiranjeevi Shocking comment's on Sye Raa Narasimha Reddy : 'ఖైదీ నెంబర్ 150' తో సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాలతో 2019లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా మాత్రం కొన్నిచోట్ల నష్టాలు కూడా వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'సైరా' వల్ల భారీగానే నష్టపోయాం

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రముఖ క్రిటిక్ రాజీవ్ మసంద్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సైరా నరసింహారెడ్డి సినిమా గురించి మాట్లాడుతూ.. "ఇన్నేళ్ల నా సినిమా జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను. చాలా సినిమాల్లో నటించాను. కానీ వాటిలో కొన్ని నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఫలానా పాత్ర చేయాలని ఎదురు చూస్తే ప్రతిసారి ఆ పాత్ర మనకు రాదు. నాకు స్వాతంత్ర సమరయోధుడిగా నటించాలని కోరిక. చాలా ఏళ్లుగా ఉండేది. అది సైరా సినిమాతో తీరిపోయింది. రామ్ చరణ్ ఖర్చులో రాజీ పడకుండా 200 కోట్లతో ఆ సినిమాను నిర్మించాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా మెప్పించలేకపోయింది. కానీ మిగిలిన రాష్ట్రాల్లో బాగానే ఆడింది. దాంతో సైరా వల్ల భారీగానే నష్టపోయాం" అని అన్నాడు.

ఆ సినిమా వల్ల నా తమ్ముడు నష్టపోయాడు

నేను గతంలో 'రుద్రవీణ' అనే సినిమా చేశాను. ఆ సినిమాని నా తమ్ముడు నాగబాబు నిర్మించాడు. సినిమాకి గొప్ప పేరు వచ్చింది. కానీ డబ్బులు మాత్రం రాలేదు. దానివల్ల నిర్మాతగా నా తమ్ముడు నష్టపోయాడు. నా సంతృప్తి కోసం సినిమాలు చేస్తే నిర్మాత జేబు కాళీ అవుతుంది. అందువల్లే వాళ్ల మేలు కోసం కమర్షియల్ సినిమాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. నిర్మాతల బాగోగులు దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. వ్యక్తిగతంగా వైవిధ్యమైన సినిమాలు చేయాలనుంటుంది. కానీ కమర్షియల్ గా వర్కౌట్ కావు" అని చెప్పుకొచ్చాడు.

'విశ్వంభర' షూటింగ్ ఎక్కడ జరుగుతుంది?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'బింబిసార' మూవీ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ బ్యాగ్ డ్రాప్ తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని పోచంపల్లి ప్రాంతంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడ మెగాస్టార్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : ప్రముఖ టీవీ ఛానెల్ లో 'సలార్' - టెలికాస్ట్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget