అన్వేషించండి

నయన్ to శ్రీలీల - వామ్మో, వీరి రెమ్యునరేషన్లు మామూలుగా లేవుగా!

చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు మేమేం తక్కువ కాదంటూ అగ్ర హీరోలతో పోటీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికలు ఎవరో తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలో ఎవరి జాతకమైనా ఒక్క శుక్రవారంతో మారిపోతుంది. కొందరికి ఒక్క సినిమాతో వరుస ఆఫర్స్ క్యూ కడితే.. మరికొందరికి మాత్రం ఒక్క ఫలితం ఎన్నో అవకాశాలను దూరం చేస్తుంది. పరిశ్రమలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే అందరూ క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. ఒక సినిమా హిట్టయితే.. వెంటనే తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు.
 
టాలీవుడ్ విషయానికొస్తే మన స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. పాన్ ఇండియా సినిమాల సందడి మొదలైన తర్వాత ప్రతీ హీరో కూడా తమ మార్కెట్ కు తగ్గట్టుగా రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. వీరితో పాటుగా పలువురు హీరోయిన్లు కూడా అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. హీరోలతో సమానంగా డిమాండ్ చేసే రేంజ్ కు ఎదిగిపోయారు. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే దక్షిణాది అందాల భామలు ఎవరో ఒకసారి చూద్దాం!

నయనతార:

సౌత్ అగ్ర కథానాయికలలో ఒకరైన లేడీ సూపర్ స్టార్ నయన్.. మూడు పదుల వయసు దాటినా రెమ్యునరేషన్ విషయంలో అసలు రాజీ పడడం లేదు. పెళ్ళై ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటునప్పటికీ, ఒక్కో మూవీకి దాదాపు రూ. 10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తున్న 'జవాన్' చిత్రంలో ఆమె పారితోషికం అదేనని టాక్. దీని కోసం నయనతార బికినీ వేయడానికి కూడా రెడీ అయిందని అంటున్నారు.  
 

సమంత రూత్ ప్రభు:

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత ఆమె తన రెమ్యూనేషన్ పెంచేసినట్లుగా చెబుతున్నారు. ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటోందనే వార్త ప్రచారంలో వుంది. పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి భారీగానే తీసుకున్నట్లు టాక్. సామ్ నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా.. ఖుషీ మూవీ సెట్స్ మీద ఉంది. అలానే సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లోనూ భాగం అవుతోంది.
 

పూజా హెగ్డే:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బుట్టబొమ్మ పూజా సైతం రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇంతకముందు 3 - 4 కోట్లు తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు రూ. 5 - 6 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్. పూజా హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి నటించిన 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన SSMB28 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
 

కీర్తి సురేష్:

మహానటి కీర్తి సురేశ్ ఇప్పుడు ఫుల్ ఫార్మ్ లో దూసుకుపోతోంది. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి.. ఒక్కో చిత్రానికి రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో 'భోళా శంకర్' తో పాటుగా 'మా మన్ననాన్', సైరన్, రివాల్వర్ రీటా, రఘు తాత వంటి సినిమాల్లో నటిస్తోంది.
 

రష్మిక మందన్న:

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటోంది. తనకున్న డిమాండ్ ను బట్టి ఒక్కొక్క సినిమాకు రూ.4 నుంచి రూ.5 కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రష్మీక 'పుష్ప 2' తో పాటుగా నితిన్ చిత్రంతో నటిస్తోంది. అలానే యానిమల్, రెయిన్ బో సినిమాలు చేస్తోంది.

అనుష్క:

ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన అనుష్క శెట్టి.. అగ్ర హీరోల స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసుకుంది. అరుంధతి, భాగమతి వంటి విమెన్ సెంట్రిక్ మూవీతో తన బాక్సాఫీసు స్టామినా ఏంటో చూపించింది. అయితే నిశబ్దం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ.. ఇప్పుడు నవీన్ పొలిశెట్టితో కలసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే సినిమా చేస్తోంది. ఈ మూవీ కోసం అనుష్క రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

శ్రీలీల:

పెళ్ళి సందడి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీలా.. ప్రస్తుతం మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా రాణిస్తోంది. ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ లక్కీ బ్యూటీ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28, పంజా వైష్ణవ్ తేజ్, నితిన్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ - బోయపాటి శ్రీనివాస్ చిత్రం, అనగనగా ఒక రోజు, జూనియర్, NBK108 సినిమాలు కూడా శ్రీ లీల ఖాతాలోనే వున్నాయి. 
 

కృతి శెట్టి:

ఉప్పెన చిత్రంతో టాలివుడ్ లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి.. తొలి చిత్రంతోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు కోటి రూపాయల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య సరసన కృతి నటించిన 'కస్టడీ' సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతోంది. అలానే శర్వానంద్ చిత్రంతో పాటుగా మలయాళంలో ఓ సినిమా చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget