![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nawazuddin on Petta: రజనీకాంత్‌తో 'పేట' చేసి చాలా గిల్టీగా ఫీలయ్యా: నవాజుద్దీన్ సిద్దిఖీ
Nawazuddin on Petta: రజనీకాంత్ నటించిన 'పేట' సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అయితే, ఆ సినిమా చేసి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను అంటున్నారు ఆయన.
![Nawazuddin on Petta: రజనీకాంత్‌తో 'పేట' చేసి చాలా గిల్టీగా ఫీలయ్యా: నవాజుద్దీన్ సిద్దిఖీ Nawazuddin Siddiqui says he felt guilty after doing Rajinikanth's Petta Here's why Nawazuddin on Petta: రజనీకాంత్‌తో 'పేట' చేసి చాలా గిల్టీగా ఫీలయ్యా: నవాజుద్దీన్ సిద్దిఖీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/722a1beb295f0a887aca73dc4d160e671708151602634239_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nawazuddin on Petta: బాలీవుడ్ టాప్ నటుల్లో ఒకరు నవాజుద్దీన్ సిద్దిఖీ. తనదైన పాత్రల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఈ మధ్యే వెంకటేశ్ నటించిన 'సైంధవ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. రజనీకాంత్ సినిమా 'పేట'తో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయన 'పేట' సినిమాలో నటించడంపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో పెద్ద హీరో అయిన రజనీకాంత్ తో నటించడం ఆనందమే. కానీ.. ఆ సినిమాలో చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యానని అన్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు నవాజుద్దీన్.
అందరినీ ఫూల్ చేసినట్లు అనిపించింది
'పిజ్జా' సినిమా ఫేమ్.. కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేసిన సినిమా 'పేట'. రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో నవాజుద్దీన్ నటించారు. ఆ సినిమాతోనే ఆయన తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కాగా.. ఆ సినిమాలో నటించడం పట్ల ఆయన చాలా గిల్టీగా ఫీల్ అయ్యారట. "పేట.. సినిమాలో నటించి చాలా గిల్టీగా ఫీలయ్యాను. షూటింగ్ అయ్యి వెళ్లిన తర్వాత.. చాలా ఫీల్ అయ్యాను. అందరినీ నేను ఫూల్స్ ని చేస్తున్నానా? అనిపించింది. ఎందుకంటే కేవలం డైలాగులు లిప్ సింక్ అవ్వడం కోసం చెప్పాను. ప్రాంప్టర్ సాయంతో డైలాగులు చెప్పాను. చాలా పదాలకు అర్థం తెలియకుండానే చెప్పాను. బాగా చెప్పినా కూడా.. ఏదో ఒక ఫీలింగ్ ఉండేది. నేనేమైనా ఫ్రాడ్ చేస్తున్నానా? అని ప్రశ్నించుకున్నాను" అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పారు నవాజుద్దీన్. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన 'పేట' సినిమాని కార్తిక్ సుబ్జరాజు డైరెక్ట్ చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించగా.. విజయ్ సేతుపతి, సిమ్రాన్, త్రిష, శశికుమార్ తదితరులు ఈసినిమాలో నటించారు. 2019లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.
'సైంధవ'లో ఆ తప్పు సవరించుకున్నాను
'సైంధవ' విషయంలో మాత్రం అలాంటి తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాను అని నవాజుద్దీన్ చెప్పారు. ఆ ఫీలింగ్ రాకుండా సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను అన్నారు నవాజుద్దీన్. "సైంధవ' సినిమా టైంలో మాత్రం అలాంటి ఇబ్బంది పడలేదు. ఆ సినిమాకి నేను సొంతంగా చెప్పుకున్నాను. దాని కోసం అన్ని తెలుసుకున్నాను. ఏ డైలాగ్ ఎందుకు చెప్తున్నాను? దాని అర్థం ఏంటి? అనేది తెలుసుకుని చెప్పాను" అని అన్నారు నవాజుద్దీన్ సిద్దిఖీ. సైంధవ సినిమాలో నవాజుద్దీన్ సొంతంగా డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమాలో తన పాత్రలో హిందీ పదాలు కూడా వచ్చాయని, దాని వల్ల మేనేజ్ చేసుకోగలిగానని నవాజుద్దీన్ గతంలో కూడా చెప్పారు. తెలుగులో వెంకటేశ్ అంటే తనకి ఇష్టం అని, ఆయన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడం అదృష్టం అని చెప్పారు.
సైలేశ్ కొలను దర్శకత్వం వహించిన 'సైంధవ' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు నవాజుద్దీన్. ఈ సినిమాలో వెంకటేశ్ హీరో కాగా.. వెంకట్ బోయిన్ పల్లి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ చేశారు. ఈ సినిమాలో నవాజుద్దీన్.. వికాస్ మాలిక్ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం నవాజుద్దీన్ అద్భుత్, నూరానీ చెహ్రా, సంగీన్ సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read: ‘పూలమ్మే పిల్లా’ పాటకు బుల్లి ఫ్యాన్స్ కవర్ సాంగ్ - తేజ సజ్జ స్పందన ఇది!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)