Teja Sajja: ‘పూలమ్మే పిల్లా’ పాటకు బుల్లి ఫ్యాన్స్ కవర్ సాంగ్ - తేజ సజ్జ స్పందన ఇది!
Teja Sajja: తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే తన సత్తాచాటాడు. పెద్ద పెద్ద హీరోల సరసన నటించిన తేజ ఇటీవల 'హనుమాన్' చిత్రంతో ఎంతోమంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయనకు అభిమానులు పెరిగిపోయారు.
Teja Sajja Fan Request: చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు 'హనుమాన్' ఫేమ్ తేజ సజ్జ.పెద్ద పెద్ద హీరోలతో నటించాడు. తన నటనతో చిన్నవయసులోనే ఎంతోమందిని మెస్మరైజ్ చేశాడు తేజ సజ్జ. ఇక ఇప్పుడు హీరోగా పరిచయమైన ఈ బాలనటుడు.. మంచి మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. డిఫరెంట్ జోనర్స్ లో, మంచి మంచి కథలు ఎన్నుకుంటున్నాడు. 'జాంబీ', 'హనుమాన్' లాంటి సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు. దీంతో ఎంతోమంది తేజ సజ్జ అభిమానులు అయిపోయారు. ముఖ్యంగా చిన్న పిల్లలు తేజకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. 'జాంబి', 'హనుమాన్' లాంటి సినిమాలు పిల్లలను తెగ ఆకట్టుకున్నాయనే చెప్పాలి.
చిన్నారి ఫ్యాన్ రిక్వెస్ట్..
అభిమానుల మనసులో ఒకటే కోరిక ఉంటుంది. ఎలాగైనా.. అభిమాన నటుడిని కలవాలి. ఆయనతో ఒక్క ఫొటో దిగాలి. అందుకే, వాళ్ల దృష్టిలో పడేందుకు ఏదో ఒక స్పెషల్ పనులు చేస్తూనే ఉంటారు. అలా తేజ సజ్జ బుజ్జి అభిమాని ఇప్పుడు తన అభిమాన హీరోను మెప్పించి, ఆయన్ను కలిసేందుకు ఏకంగా ఒక కవర్ సాంగ్ చేశాడు. దాన్ని ట్విట్టర్ ద్వారా తేజ సజ్జకి చేరేలా చేసి, ఇప్పుడు ఆయన్ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు.
పూలమ్మే పిల్ల సాంగ్ తో రిక్వెస్ట్..
'హనుమాన్' సినిమాలో మ్యూజిక్ వావ్ అనిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దాంట్లో హీరోయిన్ ఎంట్రీ 'పూలమ్మె పిల్ల.. పూలమ్మె పిల్ల సాంగ్' తెగ ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఇప్పుడు ఆ పాట దుమ్ము లేపుతోంది. ఆ పాటనే రీ క్రియేట్ చేశాడు తేజ సజ్జ చిన్నారి ఫ్యాన్. ఆ పాటలో అద్భుతంగా నటించాడు. ఇక ఆ వీడియోను ఒక యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి, తేజ సజ్జను ట్యాగ్ చేశారు. "ఈ చిన్నారి మీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక్కసారి అతనిని కలవండి" అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి స్పందించాడు తేజ సజ్జ. "డీటైల్స్ చెప్పండి.. కచ్చితంగా పిలుస్తాను" అంటూ.. ఆ చిన్నారి వీడియోను రీ ట్వీట్ చేశాడు తేజ సజ్జ.
DM the Details
— Teja Sajja (@tejasajja123) February 16, 2024
I will call him 😊 https://t.co/EcHpgeC27j
రికార్డుల మోత..
ఎలాంటి అంచనాలు లేకుండా, అతి తక్కువ స్క్రీన్ లలో రిలీజ్ అయిన సినిమా 'హనుమాన్'. కానీ, ఆ తర్వాత రికార్డుల మోత మోగించింది. ఇప్పటికే దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది. సరికొత్త రికార్డులు సృష్టించింది. మన దేశంలోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా సత్తా చాటింది ఈ సినిమా. ఇక ఇప్పుడు మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. నార్త్ లో రూ.50 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
నార్త ఇండియాలో రిలీజై రూ.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసిన సౌత్ ఇండియన్ సినిమాలు కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో 'హనుమాన్' కూడా చేరిపోయింది. ఇప్పటివరకు 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'పుష్ప', 'RRR', 'రోబో 2', 'కాంతార', 'KGF 2' సినిమాలు మాత్రమే ఈ రికార్డుని సాధించాయి. ఇక ఇప్పుడు ఆ స్టార్ హీరోల సరసన చేరిపోయాడు తేజ సజ్జ. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రజినీకాంత్, యశ్, రిషబ్ శెట్టి తర్వాత తేజ సజ్జ నార్త్ లో రూ.50 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హీరోగా రికార్డ్ సృష్టించాడు.
Also Read: బాధపడ్డ మాట వాస్తవమే- కలర్ గురించి వైవా హర్ష ఇంట్రెస్టింగ్ కామెంట్స్