Actor Navdeep: నా బాధ చూడలేక నా ఫ్రెండ్స్ అంతా అలా చేశారు, అందుకు రెండేళ్లు శ్రమించా: నవదీప్
Actor Navdeep: 'లవ్ మౌళి'.. నవదీప్ నటించిన ఈ తాజా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న నవదీప్ సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
Actor Navdeep About Love Mouli Movie: స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వచ్చిన నవదీప్.. ఇప్పుడు తన స్టైల్ మార్చేశారు. ‘లవ్ మౌళి’ అనే మూవీతో మరోసారి హీరోగా వస్తున్నాడు. ఇది నవదీప్ 2.0 వెర్షన్. తాజాగా ‘లవ్ మౌళి’ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇది ఒక పెయింటర్ ప్రేమకథ అని అర్థమవుతోంది. అయితే, ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు నవదీప్. ఈ సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని, తను కూడా చాలా మారానని అంటున్నాడు.
అన్ని ఎమోషన్స్ ఉన్నాయి.
"ఉగాది పచ్చడిలో ఉన్న ఎమోషన్స్ అన్నీ ట్రైలర్ లో పెట్టి చూపించాడు మా డైరెక్టర్. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పటి నుంచి జరుగుతుంది మరో లెక్క. ఇప్పుడంతా ఫ్రెష్ గా మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ట్రైలర్, ఫస్ట్ లుక్, టీజర్ అన్నీ చూశారు. వీడేదో చేశాడు గెడ్డం పెంచుకున్నాడు. బానే చేశాడు అని జనాల్లోకి మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. అలాంటి వైబ్ ఏదో జనాల్లోకి పంపించాను అనిపించింది. రిఫ్లెక్ట్ అయ్యి అది వెనక్కి వచ్చింది కూడా. ఈ ట్రైలర్ దాదాపు 4 నిమిషాలు ఉంది. ఇంత పెద్ద ట్రైలర్ ఏ సినిమాకి రాలేదు అనుకుంటా. లుక్ అయిపోయింది, పాటలు అయిపోయినయి, కథ చెప్పాలి అనుకున్నాం. కమర్షియల్ సినిమా అయితే కొన్ని క్లిప్స్ చూపిస్తే సరిపోతుంది. కానీ, ఇలాంటి సినిమాలకి కథ దేని గురించి అనేది చెప్పాలి. సినిమా కోసం ఏదో ప్రయత్నించారనే విషయం జనాల్లోకి వెళ్తే.. ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అని చెప్పాను. మొత్తం సినిమా మీ ముందు పెట్టాం. ఇప్పటి వరకు ఆడిన ఆట మాది అయితే, ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. మా సినిమాకి చాలా కష్టపడ్డాడు డైరెక్టర్. ఆయనే ఎడిటర్, కాస్ట్యూమ్ అసిస్టెంట్, కెమెరామెన్‌లా కష్టపడ్డారు. మేఘాలయాలో చాలా కష్ట పడ్డాం. చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఎన్ని ఇబ్బందులు పడినా ముందుకు వెళ్దాం అనుకున్నాం. దాటుకుని కిందపైన పడ్డాం అని జనాలు నమ్ముతారు. ధైర్యంతో ప్రజలు ఆదరిస్తారని బయటికి పంపాం. ఇక ఇది మీ సినిమా" అని అన్నాడు నవదీప్.
మొదట్లోనే కష్టాలు..
"ఈ సినిమా స్టార్ట్ అవుతుందా? అవ్వదా? ఇదిగో అవుతుంది.. అదుగో అవుతుంది. కానీ, అవ్వలేదు. కథ విన్నాను . బాగుంది ఏం కావాలి? అని డైరెక్టర్ ని అడిగాను. జుట్టు ముట్టుకోకు, బాడీ కావాలి అన్నాడు. జుట్టు ట్రిమ్ చేయలేదు. ఈ సినిమాలో ఏదో ఉంది దీన్ని తియ్యాలనే ఉద్దేశంతో ఇక రెండేళ్లు వర్కౌట్స్ చేశాను. బాడీ బిల్డ్ చేశాను. నా బాధ చూడలేక నా ఫ్రెండ్స్ అంతా.. ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసుకుని.. వాళ్లంతా ఒక్కటై వాళ్లు ఈ సినిమాని మ్యానిఫెస్ట్ చేశారు. వాళ్లందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకే కాదు మీ అందరికీ కూడా ఇలానే జరుగుతుంది. దేనికోసమైన కష్టపడితే కచ్చితంగా యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. ఆ రిజల్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా మీరు చూసినప్పుడు మీ జీవితాల్లో మీరు కనెక్ట్ అవుతాయి. నా పర్సనల్ గా నేను ఏం మార్చుకున్నాను అనేది నాకు తెలుసు. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది మీకు కనెక్ట్ అయితే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను" అని చెప్పాడు నవదీప్.
Also Read: ఆ రెండు బోల్డ్ వెబ్ సీరిస్‌లకు సీక్వెల్స్, నాలుగు కొత్త సినిమాలు - ‘ఆహా’ గట్టిగానే ప్లాన్ చేశారుగా!