Nari Nari Naduma Murari Teaser : రాజాలా పెంచితే రోజా ముందు కూర్చున్నావ్ - నవ్వులు పూయిస్తోన్న 'నారీ నారీ నడుమ మురారి' టీజర్
Nari Nari Naduma Murari : యంగ్ హీరో శర్వానంద్ లేటెస్ట్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' టీజర్ వచ్చేసింది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకూ ఆద్యంతం నవ్వులు పూయించింది.

Sharwanand's Nari Nari Naduma Murarai Teaser Out : టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఆయన సినిమాల్లో కొన్ని పండుగకు రిలీజై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ట్రెండ్ అవుతోంది.
నవ్వులు పూయిస్తోన్న టీజర్
'పెళ్లి కూతుర్ని తీసుకు రావడానికి వెళ్తున్నా' అంటూ శర్వా చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ లాస్ట్ వరకూ ఆద్యంత నవ్వులు పూయించింది. ఒకే ఆఫీసులో తాను ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, తన ఎక్స్ లవర్‌కు మధ్య నలిగిపోయే ఓ యువకుడి కథే 'నారీ నారీ నడుమ మురారి'. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటే ఫ్యామిలీ ఎమోషన్ కూడా జోడించినట్లు తెలుస్తోంది. ఇద్దరు అమ్మాయిల మధ్య శర్వా ఎలాంటి తిప్పలు పడ్డాడు? తన లవర్‌తో ఎందుకు బ్రేకప్ చెప్పాడు? చివరకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇలాంటి విషయాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Also Read : 'అందం సామాన్లు కనిపించే దానిలో ఉండదు' - హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ సెన్సేషనల్ కామెంట్స్
ఈ మూవీలో రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా... శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే నరేష్, సత్య, వెన్నెల కిశోర్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న ప్రీమియర్ షోలతో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Iddharu naarula naduma mee Murari :)#NariNariNadumaMurariTeaser out now!
— Sharwanand (@ImSharwanand) December 22, 2025
— https://t.co/tR5qHSCKZy
Let’s celebrate Sankranthi with #NariNariNadumaMurari on Jan 14th, from 5:49 PM onwards! pic.twitter.com/kUPYU6wFbY





















