News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Hi Nanna: నాని, మృణాల్ ఠాకూర్‌ల ‘హాయ్ నాన్న‘ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్!

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగానే మేకర్స్ తొలి లిరికల్ వీడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

FOLLOW US: 
Share:

‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని.. ‘హాయ్ నాన్న’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ‘దసరా’లో ఊరమాస్ లుక్ లో అలరించిన నాని, ఈ సినిమాలో ఓ పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది.   

‘హాయ్ నాన్న’ మ్యూజిక్ మ్యాజిక్ షురూ

రీసెంట్ గా ‘హాయ్ నాన్న’ మ్యూజిక్ కు సంబంధించి నాని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఈ మూవీ మ్యూజిక్ మ్యాజిక్ చేయబోతోందని వెల్లడించాడు. అంతేకాదు, చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఇందులో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా కనిపించింది. బ్యాగ్రౌండ్ లో సముద్రపు అలలు సందడి చేస్తూ కనిపించాయి. నాని, మృణాల్ కళ్లతోనే మాట్లాడుకోవడం కనిపిస్తుంది. త్వరలోనే మ్యూజిక్ ప్రారంభం అవుతుందంటూ తెరమీద కనిపిస్తుంది.  

సెప్టెంబర్ 18న తొలి లిరికల్ వీడియో విడుదల

తాజాగా ఈ సినిమాకు సంబంధించి తొలి లిరికల్  వీడియోను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘సమయమే’ అంటూ సాగే ఈ సాంగ్ ను సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మేరకు నాని సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశాడు. ‘హాయ్.. సెప్టెంబర్ 18, ఫాల్ ఇన్ లవ్’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ లేటెస్ట్ అప్ డేట్ నాని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం హిస్తున్నాడు. మలయాళీ సంగీత దర్శకుడు హీషమ్ అబ్దుల్ మ్యూజిక్ అందిస్తున్నారు.  ఆయన తాజా సంగీతం అందించిన ‘ఖుషి’ చిత్రం మ్యూజిక్ పరంగా అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘హాయ్ నాన్న’ మ్యూజిక్ పైనా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఫస్ట్ గ్లింప్స్ కు చక్కటి ఆదరణ

ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ ను టీ సిరీస్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో ఆడియో రైట్స్ కోసం రూ. 9 కోట్లతో డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఇక ఈ సినిమాను మోహన్ చెరుకూరి, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల కలిసి వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.  

డిసెంబర్ 21న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల

ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నాని కూతురిగా బేబి కైరా ఖన్నా కనిపించనుంది. ఇందులో శృతి హాసన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.  ఈసినిమాను డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

Read Also: థాంక్స్ చాలదు, సాంగ్స్ అదరగొట్టాలి - అల్లు అర్జున్, అట్లీ సినిమాకు అనిరుధ్ ఫిక్స్ 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 14 Sep 2023 04:01 PM (IST) Tags: Mrunal Thakur Nani Shouryuv samayama song hi nanna movie first single

ఇవి కూడా చూడండి

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Muthiah Muralidharan: ఆయన కెప్టెన్ అయితే బాగుంటుంది: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గురించి ముత్తయ్య మురళీధరన్ కామెంట్స్

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Jawan: రూ.1000 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. చరిత్ర సృష్టించిన కింగ్ ఖాన్!

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Chandramukhi 2: 480 ఫైల్స్‌ మిస్ అయ్యాయి.. అందుకే 'చంద్రముఖి 2' చిత్రాన్ని వాయిదా వేశాం: పి.వాసు

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత