Gangs of Godavari Movie: మాస్ కా దాస్‌కు.. గాడ్ ఆఫ్ మాస్ సపోర్ట్ - ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం బాలయ్య గ్రాండ్ ఎంట్రీ
బాలయ్య సపోర్టుతో విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ రాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి నటసింహం చీఫ్ గెస్టుగా హాజరు కాబోతున్నారు.
Nandamuri Balayya Chief Guest Of ‘Gangs of Godavari’: సరికొత్త కథలో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వక్ సేన్. ఆయన తాజాగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ చైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ఇప్పటి వరకు కనిపించని రీతిలో విశ్వక్ ఊరమాస్ లుక్ లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా బాలయ్య
త్వరలో సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ వేదికగా అట్టహాసం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ నెల 28న జరిగే ఈ వేడుకకు నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చీఫ్ గెస్టుగా రాబోతున్నారు. ఈ మేరకు చిత్రబృందం బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన బోతున్నట్లు చెప్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో బాలయ్య డైలాగ్స్ తో విశ్వక్ సినిమా ఎడిటెడ్ వీడియోను వదిలారు. ‘సింహం నక్కల మీదకి వస్తే వార్ అనర్రా లఫూట్, ఈజ్ కాల్డ్ హంటింగ్’ అంటూ బాలయ్య గర్జించడం ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తోంది. ఈ వీడియో చూసి బాలయ్య అభిమానులతో పాటు విశ్వక్ సేన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అంతేకాదు, ఈ సినిమాను బాలయ్య అభిమానులు కూడా చూసే అవకాశం ఉంది. ట్రైలర్ తో మంచి బజ్ క్రియేట్ కాగా, ఇప్పుడు బాలయ్య సపోర్టుతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
View this post on Instagram
‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా జూనియర్ ఎన్టీఆర్
నందమూరి ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యతో విశ్వక్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన సినిమాలను వాళ్లు బాగా ప్రమోట్ చేస్తున్నారు. ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విశ్వక్ ను ఓ రేంజిలో పొగిడారు. తన తమ్ము అంటూ దగ్గరికి తీసుకున్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు విశ్వక్ దగ్గరయ్యాడు. అటు బాలయ్య అన్ స్టాఫబుల్ షోలో పాల్గొని ఆయనకు దగ్గరయ్యాడు. అంతేకాదు, వీరద్దరూ బయట కూడా కలుస్తామని చెప్పాడు విశ్వక్. ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ లాంఛ్ లో కూడా బాలయ్య పాల్గొన్నారు. ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు బాలకృష్ణ గెస్ట్ గా వస్తుండటంతో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మే 31న ప్రేక్షకుల ముందుకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో నేహా శెట్టి జోడీ కడుతోంది. తెలుగు బ్యూటీ అంజలి కీలక పాత్రలో కనిపించబోతోంది. సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also: ఒకే రిసార్ట్ లో విజయ్, రష్మిక - రౌడీబాయ్ తమ్ముడు ఆనంద్ దేరకొండ షాకింగ్ కామెంట్స్!