అన్వేషించండి

Satyam Sundaram Movie: 'సత్యం సుందరం' సినిమాకు నాగార్జున రివ్యూ - ఆ రోజులు గుర్తొచ్చాయట, కార్తీ హార్ట్ టచింగ్ రిప్లై

Karthi Thanks Nagarjuna: పాజిటివ్ మౌత్ టాక్ తో అదరగొడుతున్న 'సత్యం సుందరం' మూవీపై కింగ్ నాగార్జున తాజాగా రివ్యూ ఇచ్చారు. ఈ మూవీ ఆయనకు ఎలా అన్పించిందో తెలుసుకుందాం పదండి.

Nagarjuna On Karthi's Satyam Sundaram Movie: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, అరవింద్ స్వామి కలిసి నటించిన తమిళ మల్టీస్టారర్ 'సత్యం సుందరం' మూవీ తెలుగులో మంచి పాజిటివ్ టాక్ తో 'దేవర'కు పోటీ ఇవ్వడానికి ట్రై చేస్తోంది. సినిమాపై ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున 'సత్యం సుందరం' మూవీనీ చూసి సోషల్ మీడియా వేదికగా సినిమా ఎలా ఉందనే విషయంపై తన రివ్యూ ఇచ్చారు. 

'సత్యం సుందరం' మూవీపై నాగార్జున రివ్యూ 
ఇటీవల కాలంలో స్టార్ హీరోల మధ్య మంచి సహకారం కనిపిస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూసి తమ తోటి హీరోలను అప్రిషియేట్ చేయడానికి స్టార్ హీరోలు ఏమాత్రం వెనకాడట్లేదు. ఇప్పటి దాకా ఈ లిస్టులో చిరంజీవి, మహేష్ బాబు యాక్టివ్ గా కనిపించగా, తాజాగా నాగార్జున కూడా అందులో చేరిపోయారు. 'సత్యం సుందరం' మూవీపై ఎలా ఉందో చెబుతూ, ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ నాగార్జున "డియర్ కార్తీ బ్రదర్... నిన్న రాత్రి 'సత్యం సుందరం' మూవీని చూశాను. అందులో నువ్వు, అరవింద్ స్వామి అద్భుతంగా నటించారు. సినిమాను చూస్తున్నంత సేపు నేను హ్యాపీగా నవ్వుతూనే ఉన్నాను. అదే నవ్వుతో ప్రశాంతంగా వెళ్లి పడుకున్నాను. సినిమాను చూసినంత సేపు చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొచ్చాయి. ముఖ్యంగా 'ఊపిరి' రోజులను ఈ సినిమా గుర్తు చేసింది. మనసుకు హత్తుకునే ఇలాంటి అద్భుతమైన సినిమాలను సినీ ప్రియులతో పాటు విమర్శకులు మెచ్చుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది.. టీం అందరికీ నా అభినందనలు' అంటూమనస్పూర్తిగా చిత్రబృందంపై నాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. 

నాగార్జున రివ్యూపై కార్తి రియాక్షన్ 
ఇక నాగార్జున అలా ట్వీట్ చేశారో లేదో వెంటనే 'సత్యం సుందరం' మూవీ హీరో కార్తీ రియాక్ట్ అయ్యారు. కార్తీ స్పందిస్తూ "థాంక్యూ సో మచ్ అన్నయ్యా... మీ ట్వీట్ మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. సినిమా మీకు నచ్చడం పట్ల మేము హ్యాపీగా ఉన్నాము. మంచి సినిమాపై మీరు చూపించే ఆదరణ మాలో మరింత స్ఫూర్తిని నింపుతుంది" అంటూ కామెంట్ చేశారు.

కార్తీ, నాగార్జున కలిసి గతంలో 'ఊపిరి' అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా '96' అనే ఎమోషనల్ లవ్ స్టోరీని మనసుకు హత్తుకునేలా చూపించి, మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ 'సత్యం సుందరం' మూవీని రూపొందించారు. ఆరేళ్ల తర్వాత డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన మూవీ ఇదే కాగా, '96' మూవీకి మించి సున్నితమైన కథాంశంతో 'సత్యం సుందరం' ప్రేక్షకులను థియేటర్లలో ఆకట్టుకుంటుంది. తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ శనివారం రిలీజ్ అయిన 'సత్యం సుందరం' మూవీ మంచి మౌత్ టాక్ తో డీసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక కలిసి నిర్మించారు. గోవింద్ వసంత్ సంగీతం అందించారు.

Also Readమేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్... అక్కడ ఫస్ట్ టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టారే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS: 'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
'అదానీ - రేవంత్ బంధాన్ని బయటపెడతాం' - అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావు సహా నేతల అరెస్ట్, తీవ్ర ఉద్రిక్తత
R Krishnaiah News: బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
బీజేపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఆర్‌ కృష్ణయ్య- రేపు నామినేషన్ దాఖలు
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం - ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ పర్వదినం, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Kakinada News: కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
కాకినాడ జిల్లాలో పులి సంచారం - స్థానికుల ఆందోళన, అటవీ అధికారుల గాలింపు
Amazon: ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
ఏడాదికి రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు - వికారాబాద్ జిల్లా యువకుడి ఘనత
BRS: అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
అదానీ, రేవంత్ భాయ్ భాయ్ టీషర్టులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అసెంబ్లీలోకి నో ఎంట్రీ, పోలీసులతో వాగ్వాదం
Telangana Group 2 Hall Tickets 2024: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్‌ అప్ డేట్ - హాల్‌ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా
Embed widget