News
News
వీడియోలు ఆటలు
X

Nagarjuna -Amala: చైతూ, అఖిల్ సినిమాలు హిట్ కావాలని కోరుకున్నాం: తిరుమలలో నాగార్జున, అమల

అఖిల్ 'ఏజెంట్', నాగ చైతన్య 'కస్టడీ' సినిమాలు విడుదల కానున్న సందర్భంగా వారి తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి సినిమాలు హిట్ కావాలని ప్రార్థించారు.

FOLLOW US: 
Share:

Nagarjuna -Amala : సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏజెంట్' సినిమా విడుదలకు సిద్ధమైంది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 27న థియేటర్లలో రిలీజ్ కానున్న నేపథ్యంలో అఖిల్ తల్లిదండ్రులు హీరో అక్కినేని నాగార్జున, అమల కలిసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తమ కొడుకులు నటించిన సినిమాలు బాగా ఆడాలని ఆశీర్వాదం తీసుకోవడానికి స్వామి దర్శనానికి వచ్చామని వారిద్దరూ వెల్లడించారు.

అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహించిన ఏజెంట్ కోసం అఖిల్ చాలా కష్టపడ్డట్టు తెలుస్తోంది. తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుని, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ, సినిమాలో తన పాత్రకు న్యాయం చేయడం కోసం అన్ని విధాలుగా తన వంతు కృషి చేసినట్టు తెలుస్తోంది. అలా ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా రెండు సంవత్సరాలు తన ఫిజిక్ కాపాడుకునేందుకు అఖిల్ చేసిన ప్రయత్నం అందరికీ స్ఫూరినివ్వకుండా ఉండదు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

స్పై థ్రిల్లర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయిన అఖిల్.. స్టైలిష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. రా ఏజెంట్ గా పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతోన్న ఈ సినిమా... అఖిల్ గతంలో నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఆశించిన ఫలితం రాబట్టి హిట్ కావడంతో ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ కూడా సక్సెస్ అయ్యిందంటే అఖిల్ కెరీర్ లో కీలక మైలురాయి చేరుకున్నట్టేనని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 
 
ఇక టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా పోస్టర్, సాంగ్స్ కు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించిన ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ నటించిన సినిమాలు (కస్టడీ, ఏజెంట్) త్వరలోనే విడుదల కానుండడంతో వారి తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అమల కలిసి తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. తమ కొడుకులు నటించిన సినిమాలు మంచి విజయం సాధించాలని స్వామి వారికి ప్రార్థించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున.. ఇద్దరూ కష్టపడ్డారని, వారిద్దరికీ మంచి టాలెంట్ ఉందని చెప్పారు. ఏజెంట్, కస్టడీ మంచి హిట్ కొట్టాలని ఆ స్వామి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నామని అమల స్పష్టం చేశారు.

Also Read : ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?

Published at : 26 Apr 2023 06:38 PM (IST) Tags: Naga Chaitanya Akhil Akkineni amala Nagarjuna Agent Custody

సంబంధిత కథనాలు

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Kriti Sanon Om Raut : తిరుమలలో వివాదాస్పదంగా మారిన కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

Prabhas On Om Raut : యుద్ధమే చేశాడు - ఓం రౌత్‌ను వెనకేసుకొచ్చిన ప్రభాస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

Odisha Train Accident: ఒడిశాలోని ఓ మార్చురీలో హర్రర్ సినిమాను తలపించే సీన్‌- హడలిపోయిన అధికారయంత్రాంగం!

YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

YS Viveka Case :  అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ రద్దు చేయండి -   సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్

WTC Final 2023: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - గెలుపు టీమిండియాదేనోయ్ - ఫ్యాన్స్‌కు ‘లెఫ్ట్’ సెంటిమెంట్