News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Evil Dead Rise Review: ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీలో కొత్త సినిమా ఎలా ఉంది? ఫ్యాన్స్‌ను ఖుషీ చేసిందా?

ఈవిల్ డెడ్ ఫ్రాంచైజీలో లేటెస్ట్ మూవీ ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : ఈవిల్ డెడ్ రైజ్ (Evil Dead Rise)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అలీస్సా సదర్లాండ్, లిలీ సులివాన్, మోర్గాన్ డేవిస్, గాబ్రియల్ ఎకోల్స్, నెల్ ఫిషర్ తదితరులు
సినిమాటోగ్రఫీ : డేవ్ గార్బెట్
సంగీతం : స్టీఫెన్ మెకియోన్
నిర్మాత : రాబ్ టపెర్ట్
రచన, దర్శకత్వం : లీ క్రోనిన్
విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2022

Evil Dead Rise Movie Review: ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హార్రర్ సినిమాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సిరీస్ ఇదే. 2013లో వచ్చిన ‘ఈవిల్ డెడ్’ తర్వాత ఈ సిరీస్ నుంచి మరో సినిమా రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. అదే ‘ఈవిల్ డెడ్ రైజ్’. మరి ఈ కొత్త ఈవిల్ డెడ్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది?

కథ: ఎల్లీ (అలీస్సా సదర్లాండ్) ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూ ముగ్గురు పిల్లలను పెంచడానికి కష్టపడుతూ ఉంటుంది. ఒకరోజు ఎల్లీ చెల్లెలు బెత్ (లిలీ సులివాన్) వారిని చూడటానికి అపార్ట్‌మెంట్‌కు వస్తుంది. అదే రోజు రాత్రి బెత్ పెద్ద కొడుకు డానీ (మోర్గాన్ డేవిస్) ఆ ఇంటి బేస్‌మెంట్‌లో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి అందులో నుంచి ఒక పుస్తకం, కొన్ని గ్రామోఫోన్ రికార్డులను తీసుకువస్తాడు. తన చెల్లి బ్రిడ్జెట్ (గాబ్రియల్ ఎకోల్స్)ఎంత చెప్పినా వినకుండా ఆ బుక్ ఓపెన్ చేసి, గ్రామోఫోన్ రికార్డులను ప్లే చేస్తాడు. దీంతో ఒక్కసారిగా వారి జీవితాలు తలకిందులు అయిపోతాయి. వారి తల్లి ఎల్లీనే వారిని చంపడానికి వస్తుంది? ఇలా ఎందుకు జరిగింది? ఆ పుస్తకంలో ఏం ఉంది? ఆ రాత్రి దాటేసరికి ఎంతమంది ప్రాణాలతో మిగిలారు? ఈ విషయాలు తెలియాలంటే ‘ఈవిల్ డెడ్ రైజ్’ థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే!

విశ్లేషణ: వరల్డ్ సినిమాలో హార్రర్ కేటగిరీకి వస్తే ‘ఈవిల్ డెడ్’ టాప్ సిరీస్‌ల్లో ఒకటిగా ఉంటుంది. 80, 90వ దశకాల్లో ప్రపంచం మొత్తాన్ని ‘ఈవిల్ డెడ్’ సినిమాలు ఒక ఊపు ఊపాయి. 90వ దశకంలో పుట్టిన వారిలో (90s Kids) చాలా మంది చూసిన మొదటి హాలీవుడ్ హార్రర్ సినిమా ‘ఈవిల్ డెడ్’నే అయి ఉంటుంది. అంత సక్సెస్‌ను ఈ సిరీస్ సాధించింది. మరి లేటెస్ట్ సినిమాలోని కంటెంట్, హార్రర్, థ్రిల్స్ ఆ స్థాయిలో ఉన్నాయా?

సినిమా స్క్రీన్ ప్లే ఆద్యంతం చాలా రేసీగా సాగుతుంది. ఎక్కడా ఒక్క అనవసరమైన సీన్ కాదు కదా, షాట్ కూడా కనిపించదు. అంత గ్రిప్పింగ్‌గా ఈ స్క్రీన్‌ప్లేను రాసుకున్నారు. సినిమా నిడివి కేవలం 97 నిమిషాలే కాబట్టి ఫస్టాఫ్, సెకండాఫ్ లాంటి మాటలు వాడటం ఇక్కడ అనవసరం. మొదటి 20 నిమిషాల పాటు పాత్రల పరిచయం జరుగుతుంది. ఒక్కసారి హార్రర్ టర్న్ తీసుకున్నాక స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంది. తల్లి చనిపోయి దయ్యంగా మారి పిల్లలను చంపడానికి ప్రయత్నించినప్పుడు పిన్ని వారి బాధ్యతలను తీసుకోవడం, నేనే తల్లిగా మిమ్మల్ని చూసుకుంటా అని వారికి మాటివ్వడం వంటి అంశాలు ఎమోషనల్‌గా బాగా పండాయి.

అయితే హార్రర్ విషయంలో మాత్రం ఈవిల్ డెడ్ రైజ్ కాస్త వెనుక పడిందనే చెప్పాలి. హార్రర్ సినిమాకు ప్రేక్షకుడు ఊహించని విధంగా వచ్చే భయపెట్టే సన్నివేశాలు (జంప్ స్కేర్ సీన్లు) చాలా ముఖ్యం. కానీ ‘ఈవిల్ డెడ్ రైజ్’ సినిమా మొత్తమ్మీద ఇలాంటి సీన్లు వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో కూడా లేవు. కేవలం ఒకటో, రెండో ఉన్నాయి అంతే. పాత ‘ఈవిల్ డెడ్’ సినిమాలు చూసిన వారికి ఇందులో పోయే కొద్దీ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. స్క్రీన్‌ప్లే కాస్త ఊహకు అందకుండా రాసుకుని ఉండాల్సింది. అప్పుడే కదా ఆడియన్స్‌కు హార్రర్‌లో అసలైన కిక్కు దొరికేది.

మరి పాత ‘ఈవిల్ డెడ్’ సిరీస్ సినిమాల కంటే ఏ విషయంలో ‘ఈవిల్ డెడ్ రైజ్’ పై చేయి సాధించింది? ‘రక్తపాతం జరగాల్సిందే!’ ‘రక్తం ఏరులై పారాల్సిందే’ ఒకప్పటి తెలుగు సినిమాల్లో చాలా ఎక్కువగా వినిపించే పంచ్ డైలాగ్ ఇది. డైరెక్టర్ లీ క్రోనిన్ దీన్ని బాగా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నాడు. స్క్రీన్ మీద ట్యాంకులకు ట్యాంకులు రక్తం పారుతూనే ఉంటుంది. మీరు ఇప్పటి దాకా చూసిన అన్ని సినిమాల్లో కనిపించిన రక్తాన్ని కలిపినా ఇందులో దాని కంటే కచ్చితంగా రెట్టింపు రక్తం ఉంటుంది. క్లైమ్యాక్స్‌కు ముందు వచ్చే ఒక సన్నివేశంలో అయితే రక్తం స్క్రీన్ మీద నుంచి ఆడియన్స్ సీటు కిందకు, కాళ్ల కిందకు వచ్చేసిందా అన్నట్లు ఉంటుంది. వయొలెన్స్, బ్లడ్ షెడ్‌ను చూపించడంలో హాలీవుడ్ దర్శకుడు క్వెంటన్ టరంటినో ముందు వరుసలో ఉంటాడు. కానీ ఆయన సినిమాల్లో కూడా ఇంత బ్లడ్ కనిపించదు. స్క్రీన్ మీద జరిగే సీన్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉన్నా సరే అందులో కనిపించే ఈ అనవసరపు రక్తపాతం ‘అరే ఏంట్రా ఇది’ అనిపిస్తుంది. రక్తం ఎక్కువగా కనిపించే సీన్లు ఉంటే అవే హార్రర్ సీన్లేమో అని దర్శకుడు అనుకుని ఉంటాడు. కానీ ఎంత వయొలెంట్ సినిమాలు అలవాటు పడిన వాళ్లకైనా ఈ సినిమాలోని రక్తపాతం చూస్తే కాస్త చిరాకు, అసహనం కచ్చితంగా కలుగుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

స్టీఫెన్ మెకియోన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సౌండ్ డిజైన్ కూడా సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. డేవ్ గార్బెట్ సినిమాటోగ్రఫీ మూడ్‌ను అద్భుతంగా క్యాప్చర్ చేసింది. సినిమా మొత్తం దాదాపు ఒకే ఇంట్లోనే తీసినప్పటికీ బోరింగ్‌గా అనిపించలేదంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్‌దే.

ఇక నటీనటుల విషయానికి వస్తే... పిల్లలను కాపాడుకోవాలనుకునే తల్లిగా, అదే పిల్లలను చంపే దెయ్యంగా అలీస్సా సదర్లాండ్ వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించింది. ముఖ్యంగా దెయ్యం పాత్రలో తను ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ భయపెట్టే విధంగా ఉన్నాయి. అక్క పిల్లలను కాపాడటానికి అవసరం అయితే దెయ్యానికి కూడా ఎదురెళ్లే పాత్రలో లిలీ సులివాన్ అదరగొట్టింది. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ‘ఈవిల్ డెడ్’ ఫ్రాంచైజీ ఫ్యాన్స్, హార్రర్, వయొలెంట్ సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. ఒకవేళ మీరు సున్నిత మనస్కులైతే మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉండండి.

Published at : 21 Apr 2023 10:27 PM (IST) Tags: ABPDesamReview Evil Dead Rise Review Evil Dead Rise Movie Review Evil Dead Rise Review in Telugu Evil Dead Rise Evil Dead Rise Rating

ఇవి కూడా చూడండి

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Naveen Polishetty: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Jagapathi Babu: కుర్రాడిగా మారేందుకు జగ్గూ భాయ్ పాట్లు.. ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందా?

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

టాప్ స్టోరీస్

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

వచ్చే నెలలో బీజేపీ ప్రచార హోరు, రంగంలోకి మోడీ, అమిత్ షా

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Singareni workers: సింగరేణి కార్మికుల అకౌంట్లలో రూ.లక్షలు జమ-త్వరలోనే పండుగ బోనస్‌

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?