అన్వేషించండి

Nagarjuna : పాతికేళ్ల యువకుడిగా నాగ్! - కింగ్ 100వ సినిమా స్టోరీ అదేనా?

King 100 Movie : కింగ్ నాగార్జున 100వ మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Nagarjuna's King 100th Movie Story : కింగ్ నాగార్జున 100వ మూవీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన కెరీర్‌లోనే కీ మైల్ స్టోన్‌గా నిలవనున్న మూవీలో ఆయన స్పెషల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ ఆర్ఏ కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా... ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తైంది.

25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ...

'కింగ్ 100' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతుండగా... ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ మూవీలో తాను 25 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకూ వివిధ దశల్లో, డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నట్లు చెప్పారు. పాతికేళ్ల యువకుడిగా కనిపించేందుకు డీ ఏజింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వయసులోనూ నాగ్ మన్మథుడిలా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో పాతికేళ్ల లుక్ అంటేనే హైప్ క్రియేట్ అవుతోంది. ఇది అక్కినేని ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ అనే చెప్పాలి. ఓ సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎదిగే ఓ వ్యక్తి ప్రయాణం నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ ప్రధానాంశంగా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా మూవీ రూపొందుతున్నట్లు ఇన్ సైడ్ వర్గాల టాక్.

Also Read : మన రామయ్య వచ్చేశాడు - శ్రీరాముడుగా రణబీర్ కపూర్ లుక్ చూశారా!

ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా టబు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగ్, టబులపై కీలక సీన్స్ కూడా షూట్ చేశారట. స్టోరీ పరంగా చూస్తే నాగ్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారని... అందుకే ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ వినిపించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్‌లో భాగం కానున్నారట. మూడో రోల్ కోసం నాట్యం ఫేం సుస్మితా భట్‌ను ఎంపిక చేసినట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

టైటిల్ అదేనా!

ఈ మూవీకి కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్ వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ దసరాకు సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ కెరీర్‌లో ఈ వందో మూవీ సంథింగ్ స్పెషల్ కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ రానున్నాయి. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Avika Gor : మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
మళ్లీ సీరియళ్లలోకి చిన్నారి పెళ్లికూతురు - లేటెస్ట్ పోస్ట్ వైరల్
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget