అన్వేషించండి

Peddi: పెద్ది లేట్ అవ్వడం లేదు... రిలీజ్ కన్‌ఫ్యూజన్‌పై రామ్ చరణ్ క్లారిటీ

Peddi Release Date: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా విడుదలపై కాస్త గందరగోళం నెలకొంది. దానికి హీరో చెక్ పెట్టారు. 'పెద్ది' లేట్ అవ్వడం లేదని 'రాకాస' టీంతో చెప్పారు.

Peddi Release Date News In Telugu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. 'ఉప్పెన' తర్వాత దర్శకుడు సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల ఎప్పుడు? అంటే... ఏప్రిల్ 30న అని చెబుతారంతా! అయితే... ఆ తేదీకి విడుదల అయ్యే అవకాశాలు లేవని, వాయిదా పడుతుందని ప్రచారం మొదలైంది. ఇటీవల 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని తొలి పాట విడుదల కార్యక్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ సైతం జూన్ 26కు వస్తుందన్నట్టు మాట్లాడారు. ఆ తర్వాత తనది పొరపాటు అని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. దాంతో 'పెద్ది' విడుదలపై కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడీ పుకార్లకు రామ్ చరణ్ చెక్ పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే...

'పెద్ది' లేట్ అవ్వడం లేదని...
'రాకాస' టీంతో రామ్ చరణ్!
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల నిర్మించిన 'రాకాస' సినిమా ఈ రోజు (ఏప్రిల్ 2, గురువారం) పెయిడ్ ప్రీమియర్లతో విడుదల అవుతోంది. రేపు (ఏప్రిల్ 3, శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. విడుదలకు ముందు 'పెద్ది' సెట్స్‌లో రామ్ చరణ్ (Ram Charan)ను 'రాకాస' టీం కలిసింది.

Also Read: Nidhhi Agerwal: నిధి అగర్వాల్ నెక్స్ట్ సినిమా ఏది? వీరమల్లు, రాజా సాబ్ తర్వాత ఏంటి?

'స్నేక్ డ్యాన్స్' పాటలో హీరోయిన్ నయన్ సారిక డ్యాన్స్ బావుందని రామ్ చరణ్ కాంప్లిమెంట్ ఇచ్చారు. 'ఇండియానా జోన్స్' తరహాలో సినిమా తీశారని దర్శకురాలు మానసా శర్మను మెచ్చుకున్నారు. వెంటనే ''మనం ఇండియానా జోన్స్ ఫ్యాన్స్ కదా'' అని నిహారిక అన్నారు. అయితే... మాటల మధ్యలో రామ్ చరణ్ లీక్స్ (Ram Charan Leaks) ఏమైనా ఇవ్వమని అడిగారు. అప్పుడు ''పెద్ది' లేట్ అవ్వడం లేదని ప్రమోట్ చెయ్యండి'' అని రామ్ చరణ్ చెప్పారు. విడుదల తేదీపై నెలకొన్న గందరగోళం రామ్ చరణ్ వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. లేట్ అవ్వడం లేదని చెప్పారు గానీ... ఏప్రిల్ 30కు వస్తుందో రావడం లేదో క్లారిటీ ఇవ్వలేదు. లేట్ లేదన్నారు కనుక ఏప్రిల్ 30న వస్తుందని అనుకోవాలి. నిజానికి ఈ సినిమా మార్చి 27న విడుదల కావాలి. అప్పటికి చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల ఏప్రిల్ 30కు వచ్చారు. అదీ సంగతి!

Also Read: Ranjith Arrest: లైంగిక వేధింపుల కేసులో మలయాళ దర్శకుడి అరెస్ట్... అసలు ఏమైందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

'పెద్ది' చిత్రీకరణలో ఇటీవల రామ్ చరణ్ కంటికి గాయమైంది. అయినా సరే సర్జరీ చేయించుకుని మర్నాడు మళ్ళీ సెట్స్‌కు వచ్చారు. సినిమా ఆలస్యం కాకూడదని ఆయన చూపిస్తున్న కమిట్మెంట్ అటువంటిది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. త్వరలో మూడో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, తాజాగా విడుదల చేసిన పెద్ది పెహల్వాన్ గ్లింప్స్‌ సైతం మంచి స్పందన రాబట్టుకుంది.

Also Read: Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!

టాప్ హెడ్ లైన్స్

The Dirty Picture 2: విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
విద్యా బాలన్ కాదు... తమన్నా - 'ది డర్టీ పిక్చర్ సీక్వెల్‌లో మిల్కీ బ్యూటీ?
Vijay Deverakonda Rashmika: తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
తిరుమలలో విజయ్ దేవరకొండ - రష్మిక... 'రణబాలి' విజయం కోసం వెంకన్నకు ప్రత్యేక ప్రార్థనలు
Sobhita Dhulipala: అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
అక్కినేని ఫ్యాన్స్‌కు శోభిత షాక్... చైతూతో పెళ్ళయ్యాక బోల్డ్ ఫోటోషూట్
Ram Charan - Sara Arjun: రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?
రామ్ చరణ్ సరసన 'ధురంధర్' బ్యూటీ - నిర్మాత ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఛీ.. ఛీ.. స్పూన్‌ పప్పు కోసం రోహిత్ రచ్చ! నీతూతో షాలిని గొడవ! నామినేషన్ల పద్ధతి ఇదే!
Windies Duo Penalised: విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
విండీస్ ప్లేయర్లపై ఐసీసీ కొరడా, పావెల్, రూథర్‌ఫోర్డ్‌లపై క్రమశిక్షణా చర్యలతోపాటు డీమెరిట్ పాయింట్ల కేటాయింపు
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Embed widget