అన్వేషించండి

Ranjith Arrest: లైంగిక వేధింపుల కేసులో మలయాళ దర్శకుడి అరెస్ట్... అసలు ఏమైందంటే?

Malayalam Director Ranjith Arrested: మలయాళ చిత్రసీమకు చెందిన దర్శక - నిర్మాత రంజిత్ బాలకృష్ణన్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... 

మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్‌ (Ranjith Balakrishnan)ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఎర్నాకుళంలో ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ సినిమా సెట్‌లో తనను రంజిత్ బాలకృష్ణన్ లైంగికంగా వేధించారని ఓ యువ నటి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

అరెస్టుకు ముందు ఏం జరిగింది?
అసలు కేసు పూర్వాపరాలు ఏమిటి?
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఒక సినిమా సెట్‌లో తనతో రంజిత్ బాలకృష్ణన్ అనుచితంగా ప్రవర్తించారని ఓ నటి ఆరోపించారు. ఆరోపణలు వచ్చిన తర్వాత సినిమాకు సంబంధించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు వెళ్ళింది. ఆ కమిటీ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత... ఇది తీవ్రమైన చర్య అని, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కేసును కేరళ పోలీసులకు బదిలీ చేసింది. అరెస్ట్ ముందు వరకు విచారణ అంతటినీ గోప్యంగా ఉంచారు. అయితే కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. నటుడిగా బిజీ అయ్యారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. నటుడిగా చేస్తున్న ఓ సినిమా సెట్‌లో యువ నటిని వేధించినట్టు టాక్.

Also ReadAnirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!

రంజిత్ బాలకృష్ణ అరెస్ట్ ఎక్కడ జరిగింది?
ఎర్నాకుళంలోని తోడుపుళాలో స్థానిక అధికారుల సహాయంతో రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్ కార్యక్రమాన్ని ఎటువంటి హడావుడి లేకుండా ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు పూర్తి చేశారు. ఓ కార్యక్రమం కోసం రంజిత్ వెళుతున్న సమయంలో... ఆయన కారును పోలీసులు అడ్డగించారు. ప్రజలకు అంతరాయం కలగకుండా ఈ అరెస్టు అత్యంత రహస్యంగా నిర్వహించారు. మొదట స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అనంతరం తదుపరి విచారణ కోసం ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also ReadTovino Thomas: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్

రెండు సంవత్సరాల క్రితం రంజిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ బెంగాలీ నటి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను రంజిత్ ఖండించారు. తనను పదవి నుంచి తప్పించి, తొలగించడానికి ఒక వర్గం ప్రయత్నిస్తోందని ఎదురు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రంజిత్ బాలకృష్ణన్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.

Also ReadProject Hail Mary India Collection: వరల్డ్ వైడ్ 2800 కోట్లు... బాక్సాఫీస్‌లో 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' దూకుడు - మరి ఇండియాలో?

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons : సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
సూర్య కాళ్లపై పడ్డ డైరెక్టర్ వెంకీ - స్టార్ హీరో రియాక్షన్ చూశారా?... వీడియో వైరల్
Jabardasth Venky Warning : వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా - జబర్దస్త్ కమెడియన్ వెంకీ స్ట్రాంగ్ వార్నింగ్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget