అన్వేషించండి

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

క‌న్న‌డ న‌టుడు నాగ‌భూష‌ణ కారును వేగంగా న‌డుపుతూ ఫుట్ పాత్ మీద వెళ్తున్న జంటను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్ లోనే చనిపోయింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

కన్నడ సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు నాగభూషణ చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులను నాగభూషణ కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే భార్య మరణించింది. భర్తకు తీవ్ర ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం అయిన నాగభూషణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే?

నటుడు నాగభూషణ శనివారం రాత్రి షూటింగ్ ముగించుకుని తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు వెళ్తున్నారు. కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రాత్రి 9.45 గంటల సమయంలో వసంత పుర ప్రధాన రహదారి దగ్గరికి కారు చేరుకుంది. అదే సమయంలో కృష్ణ(58), ప్రేమ(48) అనే దంపతులు అక్కడి ఫుత్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. కారు వేగంగా ఉండటంతో అదుపుతప్పి సదరు భార్యాభర్తలను ఢీకొట్టింది. ఆ తర్వాత పక్కనే ఉన్న కరెంట్ పోల్ కు ఢీకొని ఆగింది. వెంటనే నాగభూషణ కారులో నుంచి దిగి పరిస్థితిని గమనించారు.  స్వయంగా తనే వారిద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ, దారిలోనే ప్రేమ చనిపోయింది. కృష్ణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది.  

నాగభూషణకు స్టేషన్ బెయిల్ మంజూరు  

ఈ ప్రమాదంపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు బాధిత దంపతుల కొడుకు పార్థ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ సహా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పోలీసులు నటుడి కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కృష్ణ వైద్యాన్ని బంధించి ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అయితే, నటుడు నాగభూషణ వైపు నుంచి ఇప్పటి వరకు ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.

నటుడిగా రాణిస్తున్న నాగభూషణ

నటుడు నాగభూషణ 2018లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ‘సంకష్ఠ కర గణపతి’ అనే సినిమాతో కన్నడ వెండితెరపై కనిపించాడు. ఆ తర్వాత ‘కౌసల్య సుప్రజా రామ’, ‘డేర్ ​డెవిల్​ ముస్తాఫా’, ‘బడవ రాస్కెల్​’, ‘హనీమూన్’ ‘ఇక్కాత్​’ సినిమాల్లో నటించాడు. ‘ఇక్కాత్’ సినిమాలో నటనకు గాను ఆయనకు సైమా అవార్డు లభించింది. రీసెంట్ గా విడులైన 'తగరు పల్లయ' చిత్రంలో కూడా ఆయన కనిపించారు.  తెలుగు ప్రేక్షకులకు కూడా నాగ భూషణ పరిచమే. ఆయన నటించిన ‘హనీమూన్’ అనే ఓ వెబ్ సిరీస్ ‘ఆహా’ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇందులో ఆయన హీరో క్యారెక్టర్ చేశారు. కన్నడ చిత్రాలతో పాటు తెలుగులోనూ పలు కథలు వింటున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన కేసులో చిక్కుకోవడం పట్ల సినీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

Read Also: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
KTR Supreme Court: ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్  చేసిన కేటీఆర్
ఏసీబీ కేసును క్వాష్ చేయండి - హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన కేటీఆర్
ICC Test Rankings News: భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
భారత్ కు షాకిచ్చిన ఐసీసీ ర్యాంకింగ్స్- 2016 తర్వాత తొలిసారి ఆ ర్యాంకుకు చేరిక
Delhi Election Schedule:  ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ - తేదీలను ప్రకటించిన ఎన్నికలసంఘం
Modi Vizag Tour: విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
విద్యుత్ ఛార్జీలు తగ్గే ప్రాజెక్టుకు బుధవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న మోదీ - స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన !
Sankranthi Holidays: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు, ఈసారి ఎన్నిరోజులంటే?
YS Jagan News: ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
ఏపీ హైకోర్టులో జగన్‌కు ఊరట- ఐదేళ్లకు పాస్‌పోర్టు పునరుద్దరణకు ఆదేశం 
KTR Comments On Revanth Reddy: ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
ఫార్ములా ఈ కేసుపై జూబ్లీహిల్స్‌లోని మీ ఇంటిలో చర్చ పెడతావా?- ముఖ్యమంత్రికి కేటీఆర్‌ సవాల్
Embed widget