By: ABP Desam | Updated at : 22 Mar 2023 01:00 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Naga Shaurya/Instagram
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన ఇటీవలె ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో నటించారు. ఈ మూవీ తర్వాత నాగశౌర్య వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించేశారు. పవన్ బాసంసెట్టి దర్వకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన మూవీ టీమ్ ఉగాది సందర్భంగా మరో కొత్త అప్డేట్‌ను అందించింది. సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ మూవీకి ‘రంగబలి’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ మూవీ ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
నాగ శౌర్యకు ‘రంగబలి’ సినిమా 23వ సినిమా కావడం విశేషం. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చకున్నారు నాగ శౌర్య. ఈ సినిమాకు ముందు పలు క్యారెక్టర్లలో కనిపించినా అవి అంతగా ఆకట్టుకోలేదు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు నాగ శౌర్య. తర్వాత కూడా వరుసగా సినిమాలలో నటించారు. అయితే 2018లో ‘ఛలో’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ మూవీ ద్వారానే నటి రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు చేశారు నాగశౌర్య కానీ సరైన హిట్ ఒక్కటి రాలేదు. మధ్యలో సమంత లీడ్ రోల్ లో నటించిన ‘ఓ బేబీ’ సినిమాలో నటించినా ఆ క్రెడిట్ మొత్తం సమంతకు దక్కింది. ఇక ఈ ఏడాది ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో నటించారు నాగశౌర్య. ఈ మూవీ కూడా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు.
దీంతో వరుసగా సినిమాలు ఫ్లాప్ లుగా నిలుస్తుండటంతో నాగశౌర్య కెరీర్ రిస్క్ లో పడిందనే చెప్పాలి. అయినా నాగశౌర్య ఎక్కడా తగ్గడం లేదు. తన మార్కెట్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. త్వరలో నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ద్వారా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా మరో రెండు ప్రాజెక్టులు సెట్స్ మీద ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ ‘రంగబలి’ సినిమా. అయితే, సినిమా టైటిల్‌తోనే నాగ శౌర్య ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. టైటిల్స్‌లో హీరో నుంచి దర్శకుడి వరకు.. వారి సొంత ఊర్ల పేర్లను చూపించారు.
హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగశౌర్య. లవ్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్ లలోనూ సినిమాలు చేస్తున్నా ఒక్క హిట్ కోసం సతమతమవుతున్నారు. మరి ఈ ‘రంగబలి’ సినిమాతో అయినా నాగ శౌర్యకు మంచి కమ్ బ్యాక్ హిట్ పడుతుందో లేదో చూడాలి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు.
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
శర్వానంద్ పెళ్లి, ప్రశాంత్ నీల్ బర్త్‌డే అప్డేట్స్, ఓజీ షూటింగ్ వివరాలు - నేటి సినీ విశేషాలివే!
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Agent Settlement - Surender Reddy : 'లైగర్' రూటులో 'ఏజెంట్' డిస్ట్రిబ్యూటర్ - సురేందర్ రెడ్డి దిమ్మ తిరిగే రిప్లై!
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
థాయ్‌ల్యాండ్‌లో భర్తతో ఎంజాయ్ చేస్తున్న అనసూయ - ఫిదా అవుతున్న ఫ్యాన్స్!