అన్వేషించండి

Naga Chaitanya Sobhita Wedding LIVE: అన్నపూర్ణలో అతిథుల సందడి... మొదలైన పెళ్లి... చైతూ - శోభిత మ్యారేజ్ లైవ్ అప్డేట్స్

Naga Chaitanya Sobhita Dhulipala Wedding LIVE Updates: అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగార్జున - శోభితా ధూళిపాళ పెళ్లి సందడి మొదలైంది. మరి, ఆ వెడ్డింగ్ లైవ్ అప్డేట్స్ ఏంటో చూద్దామా?

LIVE

Key Events
Naga Chaitanya Sobhita Wedding LIVE: అన్నపూర్ణలో అతిథుల సందడి... మొదలైన పెళ్లి... చైతూ - శోభిత మ్యారేజ్ లైవ్ అప్డేట్స్

Background

స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు మనవడు, కింగ్ నాగార్జున కుమారుడు, యంగ్ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ రోజు ఓ ఇంటి వాడు కానున్నారు. తెలుగు అమ్మాయి, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసిన నటి శోభిత ధూళిపాళతో ఏడు అడుగులు వేయనున్నారు. వీళ్లిద్దరి పెళ్లికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ మ్యారేజ్ లైవ్ అప్డేట్స్ చూడండి 

ఏయన్నార్ ఆశీస్సులు ఉండాలని... ఉంటాయని!
నాగచైతన్య శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోలో చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. చిత్ర సీమలో అక్కినేని కుటుంబానికి ఒక దారి చూపించిన మూలపురుషుడు ఏఎన్నార్. ఆయన లెగసీని ఫ్యామిలీ కంటిన్యూ చేస్తోంది. ఏఎన్ఆర్ గుర్తుగా ఆయన విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ప్రతిష్టించారు. ఆయన ముందు వివాహం చేసుకోవడం వల్ల నాగచైతన్య శోభిత దంపతులకు ఆయన ఆశీస్సులు ఉంటాయని అక్కినేని కుటుంబం నమ్ముతోంది.

కుటుంబమంతా ఎంతో హ్యాపీగా... ఆనందంగా!
నాగ చైతన్య పెళ్లి నేపథ్యంలో అటు దగ్గుబాటి, ఇటు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు.‌ ఆల్రెడీ పెళ్లి సందడి మొదలైంది. అక్కినేని ఇంటికి దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు చాలా మంది చేరుకున్నారు. నాగచైతన్యను పెళ్ళి కొడుకును చేశారు. శోభిత ధూళిపాల తనను పెళ్లి కుమార్తె చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వధూవరుల కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.

చిత్ర సీమలో హేమాహేమీలంతా హాజరు కానున్నారు!
చిత్ర సీమలో నాగార్జునకు అజాత శత్రువుగా పేరు ఉంది. అందరితోనూ ఆయన కలుపుగోలుగా వెళుతూ ఉంటారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీతో, మెగాస్టార్ చిరంజీవితో నాగార్జునకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సినిమాలు పక్కన పెడితే వాళ్ళిద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేశారు. అప్పట్లో స్టార్ మా లో ఇద్దరిదీ భాగస్వామ్యం ఉండేది. ఇప్పుడు ఈ నాగచైతన్య పెళ్లికి చిరంజీవి కుటుంబమంతా హాజరుకానుంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రతతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

Also Readశోభిత ధూళిపాల స్కిన్​ కేర్ రోటీన్.. ఆ ఒక్కటి లేకుంటే ఎన్ని సర్జరీలు చేయించుకున్నా లాభం లేదంటోన్న బ్యూటీ

పెళ్లి తర్వాత శోభిత సినిమాలు మానేస్తారా? చేస్తారా?
ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో చాలా మందికి ఇప్పుడు ఒక సందేహం ఉంది. నాగచైతన్యతో వివాహం తర్వాత శోభిత ధూళిపాళ నటిగా తన కెరీర్ కంటిన్యూ చేస్తారా? సినిమాలలో నటిస్తారా? లేదంటే పెళ్లి తర్వాత ఆవిడ సినిమాలు మానేస్తారా? అని! అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తమ ఇంటికి రాబోయే కోడలికి ఎటువంటి కండిషన్లు పెట్టలేదట. శోభితను సినిమాలు చేసుకోమని చెప్పారట. నటిగా ఆవిడ సినిమాలు చేయడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వివరించారట. 

పెళ్లికి ముందు నాగ చైతన్య పూర్తి చేసిన సినిమా 'తండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శోభితా ధూళిపాళ విషయానికి వస్తే... సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నారు. 

Also Read'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?

 

20:34 PM (IST)  •  04 Dec 2024

పెళ్లి పీటల మీద చైతూ... శోభిత.... ఎంత ముచ్చటగా ఉందో కదూ

నాగ చైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి దుస్తుల్లో కొత్త జంట ఎంత ముచ్చటగా ఉందో కదూ! ఆ ఫోటోలను మీరూ చూడండి. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by shobitha Dhulipala (@sobithadhulipala)

20:03 PM (IST)  •  04 Dec 2024

విశాఖలో అక్టోబర్ 21న 'పసుపు దంచుడు'

అక్టోబర్ 21న తమ ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్టు శోభిత తెలిపారు. గోధుమ రాయి పసుపు దంచటం చేశామని ఆమె పేర్కొన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

19:55 PM (IST)  •  04 Dec 2024

చైతు, శోభిత పెళ్లి అని ఎప్పుడు అనౌన్స్ చేశారు?

ఆగస్టు 8, 2024... నాగ చైతన్య, శోభితకు నిశ్చితార్థం జరిగింది. ఆ రోజే వాళ్లిద్దరి పెళ్లి అని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు ప్రేమలో ఉన్నారని ప్రేక్షకులకు, పరిశ్రమ ప్రముఖులకూ తెలిసినా ఎప్పుడూ అక్కినేని ఫ్యామిలీ పైకి చెప్పింది లేదు. నాగార్జున ప్రకటించిన కాసేపటికి చైతు, శోభిత ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sobhita (@sobhitad)

16:47 PM (IST)  •  04 Dec 2024

పెళ్లికి వస్తున్న అతిథులు ఎవరెవరో తెలుసా?

చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు తమ తమ సతీమణులతో కలిసి వివాహానికి రానున్నారు. నయనతార, పీవీ సింధు సైతం వస్తారని సమాచారం. ప్రభాస్, అల్లు అర్జున్, రాజమౌళితో పాటు పలువురికి ఆహ్వానాలు వెళ్లాయని తెలిసింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం ఈ పెళ్లికి వస్తారని టాక్. 

16:12 PM (IST)  •  04 Dec 2024

పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్న నాగార్జున, అఖిల్

ఇవాళ మధ్యాహ్నమే అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అఖిల్ వేర్వేరు కార్లలో పెళ్లి వేదిక అయినటువంటి అన్నపూర్ణ స్టూడియో చేరుకున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Chaitanya Sobhita Marriage: అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
అంగరంగ వైభవంగా చైతన్య, శోభిత వివాహం - ఒక్కటైన కొత్త జంట!
Naga Chaitanya Sobhita Wedding : శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
శోభిత, నాగ చైతన్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగ్.. 'మా జీవితాల్లోకి సంతోషాన్ని తెచ్చావంటూ' కోడలికి ఎమోషనల్ నోట్ రాసిన మామ
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
CM Revanth Reddy: పెద్దపల్లిలో రూ.1000 కోట్ల పనులకు రేవంత్ శంకుస్థాపన, ప్రాంభోత్సవాలు - గ్రూప్ 4 విజేతలకు నియామక పత్రాలు అందజేత
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్!
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Naga Chaitanya Sobhita Wedding Pic : నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
నాగచైతన్య, శోభిత పెళ్లి ఫోటోలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పర్సనల్ పిక్స్
Best Selling Smartphones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 10 ఫోన్లు - నంబర్ వన్‌‌లో ఏ ఫోన్ ఉంది?
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
Embed widget