Naga Chaitanya Wedding: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి... సమంతతో రొమాంటిక్ ఫోటో డిలీట్ చేయని నాగ చైతన్య... కారణం ఇదేనా?
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: నాగ చైతన్య మరికొన్ని గంటల్లో శోభితతో ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే, ఇంకా సమంతతో ఆయన ఉన్న ఒక రొమాంటిక్ ఫోటో చై సోషల్ మీడియాలో కన్పించడం హాట్ టాపిక్ గా మారింది.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) త్వరలో వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లోనే ఈ జంట పెళ్లి జరగబోతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి వేడుకలు మొదలు పెట్టారు. కాబోయే వధూవరులు ఇద్దరికి మంగళ స్నానాలు చేయించిన వీడియోలు, తర్వాత శోభిత ధూళిపాళను పెళ్లి కూతురుగా చేసి, మంగళ హారతులు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగ చైతన్య తన ఎక్స్ వైఫ్ సమంతతో ఉన్న ఒక రొమాంటిక్ ఫోటోను డిలీట్ చేయలేదు అన్న వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నాగచైతన్య తన ఇంస్టాగ్రామ్ లో సమంతతో కలిసి నటించిన 'మజిలీ' సినిమాలోని రొమాంటిక్ పోస్టర్ ను అలాగే ఉంచారు. తాజాగా ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు కామెంట్స్ చేస్తుండడంతో చర్చ మొదలైంది. 2019లో రిలీజ్ అయిన 'మజిలీ' సినిమా ప్రమోషనల్ పోస్టర్ లో వీరిద్దరూ కలిసి కన్పించారు. అయితే డివోర్స్ తీసుకున్న తర్వాత ఇటు నాగ చైతన్య, అటు సమంత ఇద్దరూ పెళ్లి ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. సమంత అయితే ఒక అడుగు ముందుకేసి తన వెడ్డింగ్ గౌన్ ను కూడా మార్చేసింది. ఇక రీసెంట్ గా సమంతతో నాగచైతన్య ఉన్న ఆఖరి ఫోటోను కూడా డిలీట్ చేశాడు.
కానీ తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ లో మజిలీకి సంబంధించిన మెమొరీ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇది వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయం కాదు. పైగా ఆ పోస్టులో కూడా నాగ చైతన్య ఎక్కడా పర్సనల్ గా సమంత గురించి కామెంట్ చేయలేదు. ఆయన ప్రొఫెషనల్ గా ఆ సినిమా గురించి ప్రస్తావిస్తూ అప్పట్లో ఈ పోస్టర్ ను పోస్ట్ చేశారు. విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన ఈ పోస్ట్ ని డిలీట్ చేయకపోవడానికి కారణం అది సినిమాకు సంబంధించిన విషయం కాబట్టి అంటున్నారు. అలాగే నాగ చైతన్య ఇప్పట్లో ఆ పోస్టర్ ను డిలీట్ చేసేలా కనిపించట్లేదు. కానీ కొంతమంది మాత్రం ఈ పోస్ట్ ని చూశాక నాగ చైతన్య తన గతాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడంపై ప్రశంసలు కురిపిస్తుంటే, మరి కొంతమంది నాగ చైతన్య జీవితంలోకి శోభిత రాబోతుంది. కాబట్టి ఆ పోస్టర్ ను డిలీట్ చేస్తే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
ఇదిలా ఉండగా నాగచైతన్య సమంత కొన్నేళ్ళ పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి జంట వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2021 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరికివారు సినిమాలతో బిజీ అయ్యారు. ఇక రీసెంట్ గా నాగ చైతన్య శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ జంట డిసెంబర్ 4న రాత్రి 8 : 13 గంటలకు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు.
Read Also : "పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?