Andhra Pradesh Pension Scheme: ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభం- ఆరు దశల్లో వడపోత- గ్రామాల్లో అధికారుల సర్వే
NTR Bharosa Pension Scheme: ఏపీలో పింఛన్‌ల ఏరివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. ఏరివేత ప్రక్రియను ఆరు దశల్లో చేపట్టనున్నారు.
AP Pension Scheme Eligibility Check: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌లు అందుకుంటున్న అనర్హులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల్లో సర్వే చేస్తోంది. పింఛన్ కోసం అడ్డుదారుల్లో తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టి నిజమైన అర్హులకే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు.
దివ్యాంగులకు 15 రూపాయల పింఛన్
ఏపీలో వైక్యల్యం ఉన్న వారికి 15 వేల రూపాయలు పింఛన్ అందిస్తోంది ప్రభుత్వం. అందుకే ఇందులో ఇప్పటి వరకు ఉన్న అనర్హులను తగ్గించే ప్రయత్నాల్లో ఉంది. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పింఛన్ పొందుతున్న వాళ్లు చాలా మంది ఉన్నారని అనుమానిస్తోంది. కార్లు, భూములు ఉన్నవాళ్లు, విదేశాల్లో ఫ్యామిలు స్థిరపడినా ఇక్కడ పింఛన్ అందుకుంటున్న వాళ్లు వేలల్లో ఉన్నారు. అలాంటి వారిని ఏరివేయనున్నారు.
ఆరు దశల్లో వివరాల సేకరణ
ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆరు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. అర్హులు పింఛన్ కోల్పోయి విమర్శలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకే ఆరు దశల్లో వడపోత చేపడుతోంది. ముందుగా అధికంగా భూమి ఉన్నా, ఫోర్ వీలర్ కలిగి ఉన్నా, ఐటీ కడుతున్నా, ప్రభుత్వ పింఛన్ పొందుతున్నా, అధిక విద్యుత్ వినియోగిస్తున్నా అనర్హులుగా చేస్తారు. తర్వాత దశలో వైకల్య ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఈ క్రమంలో ఫిల్టర్ చేసిన జాబితాపై గ్రామంలోనే సభలు నిర్వహించి అర్హులను ప్రకటిస్తారు.ఇలా వివిధ దశల్లో ఫిల్టర్ చేసిన జాబితాను కలెక్టర్‌కు అందజేస్తారు.
Also Read: తెలుగుదేశంలో యనమల లేఖ కలకలం - నేతల ఆగ్రహం - సీనియర్ నేతకు పార్టీపై కోపం ఎందుకు ?
ఒక్కో బృందం 40 మంది వివరాల సేసకరణ
రాష్ట్రంలోని పలు గ్రామపంచాయితీలను ఎంపిక చేసింది ప్రభుత్వం. అక్కడ పైలెట్ ప్రాజెక్టు కింద నిర్వహించే సర్వేలో వచ్చిన ఫలితాలు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేస్తారు. లోటు పాట్లు సరి చేసుకొని చర్యలు తీసుకుంటారు. సచివాలయ సిబ్బందిని బృందాలుగా చేసి ఒక్కో టీంకు 40 మంది వివరాలు సేకరించేలా ఆదేశాలు ఇచ్చారు.
మొబైల్ యాప్ ద్వార వివరాల సేకరణ
పింఛన్లు సర్వే కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందించారు. అందులోనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఎంపీడీవోలు ఈ సర్వే బృందాలకు పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. ఇందులో అనర్హులను గుర్తించి జనవరి నుంచి వారి పింఛన్ నిలిపేస్తారు. ఎందుకు పింఛన్ ఆపేస్తున్నారో వాళ్లకు లేఖ రూపంలో తెలియజేస్తారు. వాటిని పరిశీలించి వాటికి తగ్గట్టుగా ధ్రువపత్రాలు సమర్పిస్తే మళ్లీ పరిశీలించి పింఛన్ పునరుద్దరిస్తారు.
ఈ పంచాయతీల్లోనే సర్వే
తిరుపతిలోని జీవకోనను ఎంపిక చేశారు. తిరుపతి జిల్లాలో 31 వేల 153 మంది దివ్యాంగ పింఛన్ అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ముత్తుకూరు గ్రామపంచాయతీలో కూడా సర్వే చేస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లా చాపాడు మండలం లక్ష్మీపేట, అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఈటూమార్పురం సచివాలయం పరిధిలో పింఛన్‌లపై సర్వే చేస్తున్నారు.
Also Read: మంచు కుటుంబ వివాదంలో రాజకీయ కోణం - టీడీపీ, వైసీపీ నేతల ప్రమేయం ఉందా ?