Naga Chaitanya: స్టాఫ్ బైక్‌పై నాగచైతన్య ఆటోగ్రాఫ్ - వైరల్ అవుతున్న వీడియోలో సమంత జ్ఞాపకాలు
నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ వారిద్దరూ కలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు.
కొందరు నటీనటులు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు, అసిస్టెంట్స్, మ్యానేజర్లను సొంత కుటుంబంలాగా భావిస్తుంటారు. అందుకే వారికి సంబంధించిన ప్రతీ మూమెంట్‌లో నటీనటులు కూడా పాల్గొంటారు. వారి చిన్న చిన్న సంతోషాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. తాజాగా నాగచైతన్య కూడా అదే పనిచేశాడు. తన అసిస్టెంట్ కొన్ని కొత్త బైకుపై తన ఆటోగ్రాఫ్ పెట్టడంతో పాటు ముందే తానే ఆ బైకును ఎక్కారు. దీంతో తన అసిస్టెంట్ మొహం వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా ఈ వీడియోలో ఒక విషయాన్ని గమనించిన నెటిజన్లు.. దాని గురించి చర్చించడం కూడా మొదలుపెట్టారు.
స్టాఫ్ బైక్‌పై చైతూ ఆటోగ్రాఫ్..
నాగచైతన్య స్టాఫ్‌లో ఒకరైన సోమ్ బాబు.. తన డ్రీమ్ బైకును కొనుకున్నాడు. ఇదంతా తన ఓనర్ చైతన్య వల్లే జరిగింది అన్న ఉద్దేశ్యంతో ముందుగా బైక్ కొని తన దగ్గరికే తీసుకెళ్లాడు. అంతే కాకుండా బైక్‌పై చైతన్య ఆటోగ్రాఫ్‌ను పెట్టించుకున్నాడు. ఆపై తనను బైక్‌పై కూర్చోమని చెప్పి మురిసిపోయాడు. నాగచైతన్య కూడా తన స్టాఫ్ పట్ల సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. మామూలుగా నాగచైతన్యకు కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం కాబట్టి తన దగ్గర పనిచేసే స్టాఫ్‌కు కూడా ఆ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్‌గా వస్తుందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇందులో చైతూ స్టాఫ్.. కేటీఎమ్ 390 డ్యూక్ బైక్ కొన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై తను ఆటోగ్రాఫ్ చేయడానికి వస్తున్న సమయంలో పెట్ డాగ్ హ్యాష్ కూడా తనతో ఉండడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వీడియోలో హ్యాష్..
సమంత, నాగచైతన్య పెళ్లయిన తర్వాత సమంతకు కుక్కల మీద ఉన్న ఇష్టంతో హ్యాష్ అనే ఒక డాగ్‌ను తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టింది. నాగచైతన్యకు పెట్స్ అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా సమంత కోసం హ్యాష్‌ను ఒప్పుకున్నాడు. ఆ తర్వాత హ్యాష్, నాగచైతన్య క్లోజ్ అయిపోయారని సమంత పలు సందర్భాల్లో బయటపెట్టింది. వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత తన పెట్స్‌ను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయింది సమంత. కానీ తాజాగా స్టాఫ్‌తో కలిసి నాగచైతన్య ఉన్న వీడియోలో హ్యాష్ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
View this post on Instagram
ఫ్యాన్స్‌లో చిగురిస్తున్న ఆశలు..
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత మళ్లీ వాళ్లు కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అనుకున్నారు. వారి ఫ్యాన్స్ అంతా అదే కోరుకున్నారు. ఇప్పటికీ ఇదంతా జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్నా సామ్, చై ఫ్యాన్స్ మాత్రం ఇంకా చిన్న ఆశతోనే ఉన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు అన్నీ అన్‌ఆర్కైవ్ అవ్వడం చూసి మళ్లీ వీరు కలుస్తారేమో అన్న రూమర్స్ మొదలయ్యాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య దగ్గర హ్యాష్‌ను చూసిన తర్వాత మరోసారి ఫ్యాన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి. వర్క్ విషయానికొస్తే.. సమంత తాజాగా ‘ఖుషి’తో హిట్ కొట్టింది. నాగచైతన్య మాత్రం ‘కస్టడీ’తో ఫ్లాప్ మూటగట్టుకొని హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘ఖుషి’ తర్వాత తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది సామ్. నాగచైతన్య మాత్రం చందూ మోండేటి డైరెక్షన్‌లో నటిస్తున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
Also Read: 'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial