అన్వేషించండి

Skanda box office collections: 'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

బోయపాటి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'స్కంద' మూవీ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.16 కోట్ల షేర్ ని అందుకొని పేలవమైన ప్రదర్శనను కనబరిచింది.

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'స్కంద'(Skanda) మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతంలో పేలవమైన ప్రదర్శనను కనబరిచింది. సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కినా రెండో రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ లో ఎక్కువ శాతం తగ్గుదలే కనిపించింది. సెప్టెంబర్ 28న  థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ వారాంతంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.33 కోట్ల గ్రాస్ ని రూ.17.5 కోట్ల షేర్ ని రాబట్టి యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. గురువారం రోజున రూ.14 కోట్ల గ్రాస్, రూ.8 కోట్లకు పైగా షేర్ ని రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత రోజు నుంచి వసూళ్లలో 60 శాతం తగ్గుదల కనిపించింది. రెండో రోజు నుంచి సినిమాకి టాక్ ఏమంత బాగా లేకపోవడంతో వీకెండ్ ముగిసే సరికి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. కానీ స్కంద మూవీకి వారాంతంలో బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.16 కోట్ల షేర్ రావటం గమనార్హం.

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నుండి 'స్కంద' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

గురువారం : రూ.12.75కోట్లు

శుక్రవారం : రూ.6 కోట్లు

శనివారం : రూ.6 కోట్లు

ఆదివారం : రూ.6 కోట్లు

టోటల్ కలెక్షన్స్ : రూ.32.75 కోట్లు

తెలుగు రాష్ట్రాలపరంగా పర్వాలేదనిపించుకున్న 'స్కంద' మిగతా ఏరియాల్లో పేలవమైన ప్రదర్శనను కనపరిచింది. కర్ణాటకలో రూ.2 కోట్ల కలెక్షన్స్ అందుకున్న ఈ చిత్రం ఓవర్సీస్ లో ఫస్ట్ వీక్ 400k డాలర్స్ ను సంపాదించింది.

ఇక ఏరియాల వారిగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే..

 నైజాంలో రూ.11.50 కోట్లు గ్రాస్(రూ.5.75 కోట్ల షేర్) 

ఆంధ్ర : రూ.13.50 కోట్లు గ్రాస్ ( రూ.7.15 కోట్ల షేర్)

AP/TS : రూ.29.50 కోట్లు గ్రాస్(రూ.16 కోట్ల షేర్)

కర్ణాటక : రూ.2 కోట్లు గ్రాస్(కోటి రూపాయలు షేర్)

రెస్టాఫ్ ఇండియా : రూ.1.25 కోట్లు గ్రాస్(0.50 కోట్లు షేర్)

ఇండియా వైడ్ టోటల్ కలెక్షన్స్ రూ. 32.75 కోట్లు గ్రాస్(రూ.17.50 కోట్లు షేర్) రాబట్టింది

ఇక ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద స్కంద ఫస్ట్ వీకెండ్ లో  రూ.43 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది. 

ఆదివారం రోజున కలెక్షన్స్ లో కాస్త పెరుగుదల కనిపించినా 'స్కంద' కి సోమవారం రోజు కూడా కలిసిచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం గాంధీ జయంతి సెలవు ఉంది. కాబట్టి ఆ రోజు కూడా వసూళ్లు బాగానే ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక 'స్కంద' సినిమా విషయానికొస్తే.. సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. బోయపాటి రామ్ ని కంప్లీట్ మాస్ అవతారంలో ప్రజెంట్ చేసిన సినిమా ఇది. రామ్ తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. కానీ బోయపాటి ఈ సినిమా కోసం రాసుకున్న కథ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. అలాగే సినిమాలో ఓవర్ ది టాప్ యాక్షన్ సీక్వెన్స్ లు, లాజిక్ లెస్ సీన్స్, మ్యూజిక్ కూడా ఏమంత బాగుండకపోవడం, శ్రీలీల పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోవడం, సెకండాఫ్ సాగదీతగా ఉండడం వంటి అంశాలన్నీ సినిమాకి పెద్ద మైనస్ గా మారాయి. మరి రానున్న రోజుల్లో స్కంద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Also Read : మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్ - ఈసారి దేశభక్తి చిత్రంలో యాక్షన్ రోల్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget