అన్వేషించండి

మరో కొత్త సినిమాని అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్ - ఈసారి దేశభక్తి చిత్రంలో యాక్షన్ రోల్!

బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ తాజాగా తన కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. 'స్కై ఫోర్స్' అనే దేశభక్తి నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నట్లు పేర్కొంటూ అందుకు సంబంధించిన వీడియో ని రిలీజ్ చేశాడు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అక్షయ్ కుమార్ కి 'ఓమై గాడ్ 2'(OMG2) రూపంలో మంచి సక్సెస్ దక్కింది. చాలా రోజుల తర్వాత 'ఓ మై గాడ్ 2' తో హిట్ అందుకున్న అక్షయ్ కుమార్ అదే ఊపులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు. 'ఓ మై గాడ్ 2' తర్వాత తాజాగా 'మిషన్ రాణిగంజ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా, తాజాగా మరో కొత్త ప్రాజెక్టుని అనౌన్స్ చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన సందర్భంగా(అక్టోబర్ 2) తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. 'స్కై ఫోర్స్'(Sky Force) అనే దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్లో రిలీజ్ చేశాడు. 1965లో ఇండియా - పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రానుండగా.. ఈ వీడియోలో సినిమా లోగో తో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఇండియా - పాకిస్తాన్ వార్ సమయంలో మాట్లాడిన ప్రసంగం వినిపిస్తుంది. ఆ సమయంలో జరిగిన ఇండియా - పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఓ స్పెషల్ సీక్రెట్ మిషన్ కు సంబంధించి ఈ సినిమా ఉంటుందని వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కంప్లీట్ యాక్షన్ రోల్లో కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 2024 లో విడుదల చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. వీర్ పహారియా ఈ సినిమాలో కీలక పాత్రతో తెరంగేట్రం చేస్తున్నారు. సినిమాలో అక్షయ్ కుమార్ సరసన సారా అలీ ఖాన్, నిమ్రుత్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సందీప్ కేల్వాని, అభిషేకపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ సంస్థలపై దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను మేకర్స్ అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇక అక్షయ్ కుమార్ 'మిషన్ రాణిగంజ్' విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓరియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్‌లోని రాణిగంజ్ అనే మైనింగ్ ఏరియాలో ఉన్న బొగ్గు గనుల్లో 64 మంది కార్మికులు చిక్కుకుంటారు. బొగ్గు గనుల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడే.. మైనింగ్ ఇంజనీర్ జస్వంత్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ (Akshya Kumar) క‌నిపించ‌నున్నాడు. 'ది గ్రేట్ భారత్ రెస్క్యూ' అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన పరిణితి చోప్రా కథానాయికగా నటిస్తోంది. వశు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిఖా దేశ్‌ముఖ్, అజయ్ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది.

Also Read : నేషనల్ క్రష్ కుమ్మేస్తోంది - లైనప్ లో ఏకంగా 7 సినిమాలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 మూవీస్ స్ట్రీమింగ్... సినిమాలు, వెబ్ సిరీస్‌లు డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 మూవీస్ స్ట్రీమింగ్... సినిమాలు, వెబ్ సిరీస్‌లు డోంట్ మిస్
Allu Arjun : అల్లు అర్జున్ మరో ఘనత - ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై స్టార్... రామ్ చరణ్ కూడా...
అల్లు అర్జున్ మరో ఘనత - ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై స్టార్... రామ్ చరణ్ కూడా...
Avengers Endgame Re Release : మరోసారి థియేటర్లలో అవెంజర్స్ సందడి - ఎండ్ గేమ్: ఎంకోర్ రిలీజ్ ఎప్పుడంటే?... ఈసారి వెరీ స్పెషల్
మరోసారి థియేటర్లలో అవెంజర్స్ సందడి - ఎండ్ గేమ్: ఎంకోర్ రిలీజ్ ఎప్పుడంటే?... ఈసారి వెరీ స్పెషల్
Ranabaali: అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ 'రణబాలి'... రజనీకాంత్ 'జైలర్ 2'తో క్లాష్
అక్టోబర్‌లో విజయ్ దేవరకొండ 'రణబాలి'... రజనీకాంత్ 'జైలర్ 2'తో క్లాష్

వీడియోలు

CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
అమరావతి రైతులకు గుడ్ న్యూస్! రుణమాఫీకి సీఆర్డీఏ అంగీకారం! 
Panchadarla Konda: పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
పంచదార్ల కొండకు మైనింగ్ ముప్పు నుంచి విముక్తి! నో మైనింగ్ జోన్‌గా ప్రకటించిన ఏపీ సర్కారు!
Nepal Floods: నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్ వరదలకు అణు బాంబులాంటి మంచు ముక్కే కారణం! భవిష్యత్‌లో మరిన్ని ఘటనలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
నేపాల్‌-టిబెట్ సరిహద్దుల్లో వరదల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక చర్యలు! నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వాలు!
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
CM Revanth Inspects Mir Alam Tank Bridge | క్రేన్ ఎక్కి బ్రిడ్జి పనులను పరిశీలించిన రేవంత్
HPV Vaccination : HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
HPV వ్యాక్సిన్ పెద్దయ్యాక కాదు.. చిన్న వయసులోనే వేయించాలి.. తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయాలివే
MS Dhoni CSK Stake: సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
సీఎస్‌కేలో ధోనీకి 25 శాతం వాటా రూమ‌ర్స్ ... ఆకాష్ చోప్రా క్లారిటీ!
Dravid-Sehwag Young Cricket Legacy: టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
టీమిండియాలోకి మళ్లీ సెహ్వాగ్- ద్రవిడ్ జంట‌... ఇండియా అండ‌ర్-19 జ‌ట్టులో దిగ్గ‌జ‌ వార‌సుల‌కు చోటు!
Embed widget