అన్వేషించండి

Rashmika Mandanna: నేషనల్ క్రష్ కుమ్మేస్తోంది - లైనప్ లో ఏకంగా 7 సినిమాలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ చిత్రాల్లో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె లైనప్ లో 7 సినిమాలు ఉన్నాయి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘కిర్రాక్ పార్టీ’ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అమ్మడు అందానికి, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. 

Also Read: మరోస్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి, వరుస ఆఫర్లతో ఫుల్ జోష్

వరుస సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ

రష్మిక మందన్న తాజాగా అర డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం ఈ కూర్గ్ బ్యూటీ లైనప్ లో 7 సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప’ సినిమా తర్వాత తెలుగులో కాస్త వెనుకబడినా, ఇతర సినిమా పరిశ్రమల్లో వరుస అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప: ది రూల్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు రెడీ అవుతోంది. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది.  ఈ సినిమాతో పాటు ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీలో ర‌ష్మిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇప్పటికీ రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రష్మిక, మరో సినిమాలో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో తొలుత శ్రీలీల‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తన ప్లేస్ లో రష్మికను ఫిక్స్ చేశారట.   

Also Read: అండర్ వాటర్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, 'దేవర' నుంచి పూనకాలొచ్చే అప్ డేట్ !

రెండేళ్ల వరకు నో డేట్స్!

మరోవైపు ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతోన్న ద్విభాషా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ కనిపించబోతోంది. ఇప్పటికే ‘రెయిన్‌ బో’ అనే సినిమాను మొదలు పెట్టింది. అటు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు సౌత్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సందీప్ వంగాల కాంబోలో వస్తున్న ‘యానిమల్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని అవకాశాలు వచ్చినా, డేట్స్ కుదరక పోవడంతో వాటిని వదులుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు సంవత్సరాల వరకు ఆమె డేట్స్ దొరకడం కష్టమనే టాక్ నడుస్తోంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Blue Whales Welcome Sunita Williams | ఫ్లోరిడా తీరంలో ఆస్ట్రానాట్లకు స్వాగతం పలికిన సముద్ర జీవులు | ABP DesamSunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
తెలంగాణ బడ్జెట్‌లో నిరుద్యోగులకు తీపి కబురు- 57,946 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు ప్రకటన
YS Viveka Case: వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
వివేకా కేసులో మరో నిందితుడికి ప్రాణభయం - హత్య సినిమాపైనా ఫిర్యాదు- ఎస్పీని కలిసిన ఏ-2 సునీల్ యాదవ్
Telangana Latest News:పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
పొలిటికల్ డైలమాలో తీన్‌మార్ మల్లన్న! బిఆర్‌ఎస్‌కు దగ్గరవ్వడం రేవంత్ వ్యూహమేనా?
Chandrababu Naidu meets Bill Gates: ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
ఏపీలో గేట్స్ ఫౌండేషన్ సేవలు - బిల్ గేట్స్ బృందంతో ఏపీ సీఎం ఒప్పందాలు
Smita Sabharwal: వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
వివాదంలో స్మితా సభర్వాల్ - కారు అద్దె పేరుతో రూ.61 లక్షలు తీసుకున్నారని ఆరోపణల !
Telangana Roads: HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
HAM ద్వారా రహదారుల అభివృద్ధి, 28 వేల కోట్లతో 17,000 కిలోమీటర్ల గ్రామీణ రహదారులే టార్గెట్
Warangal Crime News: మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం  - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
మైనర్లకు గంజాయి అలవాటు చేసి వ్యభిచారం - వరంగల్‌లో కీచకుల ముఠా అరెస్ట్ - ఎన్ని దారుణాలంటే?
Rythu Bharosa Scheme: అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
అన్నదాతలకు గుడ్ న్యూస్, రైతు భరోసా పథకానికి భారీగా కేటాయింపులు
Embed widget