అన్వేషించండి

Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?

Naga Babu Tweets: మెగా బ్రదర్‌ నాగబాబు వరస ట్వీట్స్‌ నెట్టింట సంచలనం రేపుతున్నాయి. చూస్తుంటే ఆయన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ని ఉద్దేశించే ఈ పోస్ట్స్‌ చేశారని నెటిజన్స్‌ అభిప్రాయపుతున్నారు. 

Naga Babu Supports Jani Master?: మెగా బ్రదర్‌ నాగబాబు షాకింగ్‌ ట్వీట్‌ చేశారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో ఆయన చేస్తున్న వరసు ట్వీట్స్‌ సెన్సేషన్‌ అవుతున్నాయి. తాజాగా నాగబాబు బ్రిటిష్ లాయర్ విలియం గారో, రాబర్ట్‌ ఇవాన్స్‌ కోట్స్‌ షేర్‌ చేస్తున్నారు. ఆయన తీరు చూస్తుంటే అవి జానీ మాస్టర్‌ కోసమే పెడుతున్నారా? అని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. తాజాగా నాగబాబు ఓ షాకింగ్‌ ట్వీట్ వదిలారు. 

"మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ప్రతి కథలోనూ మూడు వెర్షన్‌లు ఉంటాయి. వారు, మీరు మరియు నిజం" అంటూ రాబర్ట్‌ ఈవాన్‌ కోట్‌ షేర్‌ చేశారు. దానికి ముందు "నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు అతడు లేదా ఆమెను నిందితులుగా పరిగణించలేము" బ్రిటిష్ లాయర్ విలియం గారో కోట్‌ని పంచుకున్నారు. ఇలా నాగబాబు వరుస ట్వీట్స్‌ చూస్తుంటే ఇవి జానీ మాస్టర్‌ కేసును ఉద్దేశించే చేస్తున్నారని అంటున్నారు. చూస్తుంటే ఆయన జానీ మాస్టర్‌కు మద్దతుగా నిల్చున్నాడని తెలుస్తోంది. ఈ కేసులో తెలియని కోణాలెన్నో ఉన్నాయని, నిజానిజాలు తేలే వరకు ఆగండని ఆయన పరోక్షంగా ఈ కేసుపై స్పందించారంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నాగబాబు ట్వీట్స్‌ నెట్టింట చర్చనీయాంశం అవుతున్నాయి. 

Also Read: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...

కాగా జానీ మాస్టర్‌ జనసేన పార్టీ సభ్యుడనే విషయం తెలిసిందే. ఇటీవల ఏపీ ఎన్నికల్లో జనసేనాని గెలుపు కోసం ఆయన పార్టీ తరపు ప్రచారంలో పాల్గొని గట్టి ప్రచారం చేశారు. అంతేకాదు జనసేన పార్టీలోనూ ఆయన కీలక పదవిలోనూ ఉన్నాడు. అయితే ఆయన లైంగిక వేధింపుల కేసు నమోదు అవ్వడంతో జనసేన పార్టీ అతడిని సస్పెండ్‌ చేసింది. జానీ మాస్టర్‌ కొంతకాలంగా తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ అతడి అసిస్టెంట్‌ మహిళ కొరియోగ్రాఫర్‌‌, ఢి కంటెస్టెంట్ హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీసు స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

అసలేం జరిగిందంటే...

2019లో ఢీ 12 కంటెస్టెంట్‌గా చేసింది. అదే సమయంలో జానీ మాస్టర్‌ ఈ షోకు జడ్జీగా ఉన్నాడు. అదే సమయంలో ఆమెతో జానికి పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెను జానీ తన అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నాడు. అదే టైంలో ముంబై ఔట్‌డోర్‌ షూటింగ్‌కి వెళ్లినప్పుడు హోటల్‌ గదిలో జానీ మస్టర్‌ తన రూంలోకి బలవంతం వచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ టైం ఆమె మైనర్‌ కావడంలో పోలీసులు ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే తనపై లైంగిక ఆరోపణలు వచ్చినప్పటి నుంచి జానీ మాస్టర్‌ పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు ఆయన కోసం గాలించగా బెంగళూరులో ఉన్నట్టు తెలిసిందే. దీంతో పోలీసులు ఆయన ప్రాంతాన్ని చుట్టుముట్టి జానీ మాస్టర్‌ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతడికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేసిన తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

శ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!హైటెక్ సిటీలో పేలుడు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పరుగో పరుగుAmbani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Russia Ukraine War: ట్విన్ టవర్స్ పై  9/11 అల్‌ఖైదా దాడుల తరహాలో విరుచుకుపడ్డ ఉక్రెయిన్ -రష్యాలో భారీ బిల్డింగులపై ఎటాక్ - వీడియో
రష్యాపై 9/11 తరహా దాడి.. కజాన్ నగరంలో భారీ టవర్స్‌పై డ్రోన్లతో ఎటాక్ర- వీడియో
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Sandhya Theatre Incident: రేవతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం, అసెంబ్లీలో కోమటిరెడ్డి ప్రకటన
Vizag Human Trafficking Case: విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
విశాఖలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా గుట్టురట్టు, 11 మంది బాలికలకు విముక్తి
Asifabad Student Dies: ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి, ఆ తల్లి కన్నీళ్లకు బదులిచ్చేది ఎవరు?
Earthquake In Prakasam: 5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
5 తీవ్రతతో ప్రకాశం జిల్లాలో భూకంపం- పరుగులు పెట్టిన జనం
Agriculture: వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
వ్యవ'సాయం' చేస్తాం, దేశానికి తిండి పెడతాం - తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న రైతుల సంఖ్య
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
Embed widget