అన్వేషించండి

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కీ 2898 ఏడీ’ ఆ హాలీవుడ్ మూవీకి కాపీ? నాగ్ అశ్విన్ సమాధానం ఇదే!

ప్రభాస్ నటిస్తున్న Kalki 2898 AD కోసం సినిమా ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తురు. అయితే ఈ సినిమా 'డ్యూన్' మూవీకి కాపీ అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించాడు.

Nag Ashwin About Kalki 2898 AD: ప్ర‌భాస్, దీపికా ప‌దుకునే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల హాస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న సినిమా 'కల్కీ 2898 ఏడీ'. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. అయితే, అది హాలీవుడ్ సినిమా ‘Dune’లో పోస్టర్ తరహలో ఉంద‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. హైద‌రాబాద్‌లో వీఎఫ్ఎక్స్ మీట్ లో ఆయ‌న ఒక స్టూడెంట్ అడిగిన ప్ర‌శ్న‌కి స‌మాధానం ఇచ్చాడు. 

ఇసుక ఉండ‌టం వ‌ల్లే.. 

హాలీవుడ్ సినిమా 'డ్యూన్'కి కాపీలా అనిపిస్తుంది ఈ సినిమా. దానికి దీనికి పోలిక ఉందా? అని ఒకరు ప్ర‌శ్నించగా.. నాగ్ అశ్విన్ కొట్టిపారేశారు. "ఇసుక ఉండ‌టం వ‌ల్ల మాత్ర‌మే మీకు అలా అనిపిస్తుంది" అని న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు. "కేవ‌లం ఇసుక ఉండ‌టం వ‌ల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయ‌ని కూడా మీరు అనుకోకూడ‌దు" అని పేర్కొన్నారు. ఇక 'కల్కీ 2898 ఏడీ', 'డ్యూన్' చిత్రాల్లో సెట్టింగ్‌లు ఒకేలా ఉంటాయి. దీంతో దాన్ని కాపీ కొట్టారు అనుకుంటున్నారు అంద‌రూ. కాన్సెప్ట్, మేకింగ్‌, క్రాప్ట్ , విజువ‌లైజేష‌న్ ఇలా ప్ర‌తీదాన్ని హాలీవుడ్ సినిమాల‌తో పోలుస్తున్నారు. కానీ, క‌థ‌, క‌థ‌నం వేరేలా ఉండొచ్చు అని అంచ‌నా వేస్తున్నారు ఫ్యాన్స్. 

జూన్ 27న రిలీజ్..  

ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాని మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేక‌ర్స్. మే 3న సినిమా రావాల్సి ఉంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నిక‌లు ఉన్న కార‌ణంగా దీన్ని పోస్ట్ పోన్ చేశారు మేక‌ర్స్. ఎన్నిక‌ల త‌ర్వాత జూన్ 27న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

ఇక ఈ సినిమా మ‌హాభార‌తంతో ప్రారంభ‌మై 2898 ఏడీలో ముగుయ‌నుంద‌ని నాగ్ అశ్విన్ గ‌తంలో చెప్పారు. దాదాపు 6000 సంవ‌త్స‌రాల కాలానికి విస్త‌రించింద‌ని అన్నారు. ఈ సందర్భంగా భిన్న ప్ర‌పంచాల‌ను సృష్టించేందుకు ప్ర‌య‌త్నించామ‌ని, అవి ఎలా ఉంటాయో ఊహించలేర‌ని బ్లేడ్ ర‌న్న‌ర్‌లా కాకుండా ఇండియ‌న్ లాగానే ఉంటాయ‌ని అన్నారు నాగ్ అశ్విన్. 

ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ప్ర‌భాస్, దీపికా ప‌దుకునే, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లంతా భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ దాదాపు రూ.150 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భాస్ ఒక ఏరియా ప్రాఫిట్స్ తీసుకుంటున్న‌ట్లు సినిమా వ‌ర్గాల్లో టాక్. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకునే కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నార‌ట‌. వీళ్ల అంద‌రి రెమ్యున‌రేష‌న్ సినిమా బ‌డ్జెట్ లో 35 శాతం అని టాక్ వినిపిస్తోంది.

Also Read: నాని ఆ సినిమాలు చేయ‌కు అన్నారు, ఇప్పుడు మిస్ అవుతున్నా అంటున్నారు: అల్ల‌రి న‌రేశ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather News: తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul About Security For Strong Rooms | స్ట్రాంగ్ రూమ్‌లకు సెక్యూరిటీ లేదంటున్న పాల్ | ABP DesamPulivarthi Nani Pressmeet About Attack on Him | పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు | ABP DesamTollywood Celebs in Bangalore Party | టాలీవుడ్ సెలబ్రిటీలు బెంగళూరు పార్టీలో ఉన్నారా? | ABP DesamKarate Kalyani About Hema Drugs Case | హేమ డ్రగ్స్ కేసుపై మాట్లాడిన కరాటే కళ్యాణి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather News: తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం, ఏపీపై ఎఫెక్ట్ ఎంత? విపత్తుల సంస్థ క్లారిటీ
Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలనాలు, డ్రగ్స్ పాజిటివ్‌గా తెలుగు నటులు!
Hyderabad News : రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
రోడ్డుపై గుంతలో కూర్చుని మహిళ పోరాటం - దెబ్బకు దిగొచ్చిన అధికారగణం
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత అంటూ ప్రచారం - ఆ ఒక్క ట్వీట్‌తో చెక్
Raghurama: జగన్, కేఏ పాల్ పిచ్చాస్పత్రిలో ప్రమాణం ఆరోజే, జూన్ 4న ఆపార్టీకి పెద్దకర్మ - రఘురామ సెటైర్లు
జగన్, కేఏ పాల్ పిచ్చాస్పత్రిలో ప్రమాణం ఆరోజే, జూన్ 4న ఆపార్టీకి పెద్దకర్మ - రఘురామ సెటైర్లు
Pinnelli video :  ఇంతకీ పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది ? - తేల్చాలంటున్న వైసీపీ
ఇంతకీ పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది ? - తేల్చాలంటున్న వైసీపీ
Drug Test Purpose : డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్​కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట
డ్రగ్ టెస్ట్ ఎవరికి, ఎలా చేస్తారో తెలుసా? ఈ టెస్ట్​కి ఆ నమూనాలే కీలకం.. బ్లడ్ కాదట
Telangan News : జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు  - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
జూన్ 4 తర్వతా బీఆర్ఎస్ ఉండదు - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget