అన్వేషించండి

Allari Naresh: నాని ఆ సినిమాలు చేయ‌కు అన్నారు, ఇప్పుడు మిస్ అవుతున్నా అంటున్నారు: అల్ల‌రి న‌రేశ్

Allari Naresh: అల్ల‌రి న‌రేశ్.. ఒక‌ప్పుడు కామెడీ సినిమాల‌తో అల‌రించారు. ఇప్పుడు డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. అయితే, దానికి కార‌ణం నాని అని అంటున్నారు. అస‌లు ఏంటంటే?

Allari Naresh About Actor Nani: అల్ల‌రి నరేష్.. ఒక‌ప్పుడు కామెడీ సినిమాల‌కు పెట్టింది పేరు. అదిరపోయే పంచ్‌లు, జోకులతో అల‌రించడం ఆయన తర్వాతే ఎవరైనా. అయితే, ఒక్కసారిగా ఆయన జోన‌ర్ మార్చేశారు. కామెడీని ప‌క్క‌న పెట్టి, ఎమోష‌న‌ల్, సీరియ‌స్ కాన్సెప్ట్స్ తో జ‌నాల ముందుకు వ‌చ్చారు నరేష్. అయితే, అలా చేయ‌మ‌ని చెప్పింది నానినే అట‌. నరేష్, ఫరియా అబ్దుల్లా జంట‌గా న‌టించిన ‘ఆ ఒక్క‌టి అడ‌క్కు’ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాలు చెప్పారు. త‌న‌లో కామెడీ కాకుండా వేరే కోణం కూడా ఉంద‌ని నాని అన్నార‌ని, ఆ మాట‌లు విని ఆలోచించాను అని నరేష్ అన్నారు. 

నాలో మ‌రో యాంగిల్ ఉంద‌న్నారు నాని.. 

"చాలా రోజుల నుంచి కామెడీ మాత్ర‌మే చేస్తున్నాను అనే ఫీలింగ్ ఉంది నాలో. ‘మేడ మీద అబ్బాయి’ ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చిన‌ప్పుడు నాని ఇలా అన్నారు. నరేష్‌కు చాలా పొట‌న్షియ‌ల్ ఉంది. అంద‌రూ ఒక‌వైపే చూస్తున్నారు. అత‌నిలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. "గ‌మ్యం', 'శంభో శివ శంభో', 'నేను' అలాంటివి చేస్తే బాగుంటుంది. కామెడీ కాకుండా అలాంటి కూడా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేను" అన్నాడు. అయినా కూడా ఆ త‌ర్వాత కామెడీ చేశాను. అవ‌న్నీ నాకు కావాల్సి చేయ‌లేదు. ప్రొడ్యూస‌ర్ అండ్ డైరెక్ట‌ర్. సార్ మీతో కామెడీ సినిమా చేస్తాను అని అప్రోచ్ అయ్యేవాళ్లు." 

త‌ర్వాత ఆలోచించాను.. 

"ఆ త‌ర్వాత ఏమైందంటే? కామెడీ చేసినా పెద్ద‌గా హిట్ అవ్వ‌డం లేదు. అందుకే మొత్తం కామెడీ చేయ‌కూడ‌దు అని డిసైడ్ అయ్యాను. పంచ్ లు అన్నీ రాస్తున్నారు. కానీ, క‌థ ఏం ఉండ‌టం లేదు. ఎక్క‌డ రాంగ్ స్టెప్ వేస్తున్నానా? అని ఆలోచించాను. అప్పుడు నాన్న‌గారి సినిమాలు అన్నీ అబ్జ‌ర్వ్ చేసి క‌థ‌లో కామెడీ ఉండాలి, అది మిస్ అవుతుంది  అని అర్థం అయ్యింది. జ‌నాల‌కు డిఫ‌రెంట్ గా కావాలి అనుకున్నాను. అలా వెయిట్ చేసి అప్పుడు 'నాంది' చేశాను. 'నాంది' హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత 'మారేడుమిల్లి', 'నా సామిరంగ‌', 'ఉగ్రం' చేశాను. నాలుగు సినిమాలే చేశాను. మ‌ళ్లీ ఇటు వ‌చ్చేశాను. త‌ను కూడా ఏమ‌న్నాడంటే? అదే కాదు ఇది కూడా చేయి అన్నాడు. ఇప్పుడు వ‌చ్చి రివ‌ర్స్ చెప్పాడు. "నరేష్ ని నేను ఆపేయ‌మ‌ని చెప్పాన‌ని, నేనే ఆయ‌న కామెడీ చాలా మిస్ అవుతున్నాను" అని అన్నాడు. ఆడియెన్స్ కూడా అదే అనుకునే ఛాన్స్ ఉంది క‌దా?  అని అన్నారు నరేష్. 

మే 3న.. 

'ఆ ఒక్క‌టి ఆడ‌క్కు' సినిమా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఫరియా అబ్దుల్లా, అల్ల‌రి నరేష్ న‌టించిన ఈసినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే అంద‌రినీ ఆక‌ట్టుకుంది. పెళ్లి అవ్వ‌డం లేద‌నే ఒక కాన్సెప్ట్ తో తెర‌క్కెకించారు దీన్ని. దీంతో ఈ రోజుల్లో ప్రాబ్ల‌మ్ ఫేస్ చేస్తున్న చాలామంది ఈ సినిమాకి బాగా క‌నెక్ట్ అయ్యారు. ట్రైల‌ర్ యువ‌త‌ను బాగా ఆక‌ట్టుకుంటుంది . ఇప్ప‌టికే నరేష్ చెప్పిన చాలా డైలాగులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: వైర‌ల్ అవుతున్న మ‌హేశ్ బాబు వీడియో.. రాజ‌మౌళి సినిమా లుక్ అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Crazy Kalyanam Review - 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget