Naari: ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ - వన్ ప్లస్ వన్ ఆఫర్ అనౌన్స్ చేసిన 'నారి' మూవీ టీం
Naari Movie Team Offer: సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'నారి'. ఈ నెల 7న రిలీజ్ అవుతుండగా.. మూవీ టీం 2 రోజులు కపుల్ ఆడియన్స్‌కు టికెట్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించింది.

Naari Movie Team One Plus One Ticket Offer For Couples: ప్రముఖ సీనియర్ నటి ఆమని (Aamani), వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'నారి' (Naari). ఈ సినిమాకు సూర్య వంటిపల్లి (Surya Vantipalli) దర్శకత్వం వహించగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహిళా సాధికారత, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలి..?, వారికి ఎలా అండగా నిలవాలి.. వంటివి ప్రధానాంశాలుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్, పాటలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా మూవీ టీం బంపరాఫర్ ప్రకటించింది. ఈ నెల 7, 8 తేదీల్లో 'నారి' సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్‌పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చింది. ఆ 2 రోజుల్లో అన్నీ షోస్‌కు ఈ ఆఫర్ వర్తించనున్నట్లు తెలిపింది. టికెట్స్‌ను సమీపంలోని థియేటర్‌లో, బుక్ మై షో యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సినిమాలో కేదార్ శంకర్, ప్రమోదిని, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ కీలక పాత్రలు పోషించారు.
ఇటీవల రమణ గోగుల పాడిన 'గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే' పాట యూత్ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. యూట్యూబ్‌లో మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలోనే ప్రముఖ సింగర్ సునీత పాడిన 'హవాయి.. హవాయి..' పాట సైతం ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఫ్యామిలీ డ్రామా స్టోరీతో 'నారి' సినిమాను రూపొందించినట్లు డైరెక్టర్ సూర్య వంటిపల్లి తెలిపారు.





















