Naanum Rowdy Dhaan copyright case : సీన్లపైనే కాదు నయనతార బట్టలపై కూడా ధనుష్‌కి రైట్స్... ధనుష్, నయన్ వివాదంలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
Naanum Rowdy Dhaan copyright case : నయనతార - ధనుష్ వివాదం కేసు తాజాగా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ధనుష్ లాయర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

Dhanush Nayanthara copyright case : లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ 'నయనతార : బియాండ్ ది పెయిరీ టేల్' వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'నేనూ రౌడీనే' సినిమాకు సంబంధించిన పలు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో నయనతార బట్టలపై కూడా ధనుష్ కు రైట్స్ ఉన్నాయనే విషయం షాకింగ్ గా మారింది.
నయనతార బట్టలపై కూడా రైట్స్ !
నయనతార 'నయనతార : బియాండ్ ది పెయిరీ టేల్' డాక్యుమెంటరీలో ఆమె హీరోయిన్ గా నటించిన మూవీ 'నేనూ రౌడీనే' (నానుమ్ రౌడీ డాన్) మూవీ నుంచి బీటీఎస్ సీన్స్ ఉపయోగించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తన పర్మిషన్ లేకుండా ఈ సినిమాలోని బీటీఎస్ క్లిప్పింగులను డాక్యుమెంటరీలో ఉపయోగించుకున్నందుకు ధనుష్ నయనతారతో పాటు నెట్ ఫ్లిక్స్ టీంపై కాపీ రైట్ కేసును వేశారు. 2015లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ధనుష్ నిర్మాత. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, ఆమె భర్త విగ్నేష్ శివన్ డైరెక్టర్. అయితే ఈ సినిమాలోని క్లిప్స్ ను తన అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడంతో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా ఈ కేసు విచారణలో ధనుష్ తరపు న్యాయవాది షాకింగ్ విషయాలను వెల్లడించారు. డాక్యుమెంటరీలో ఉపయోగించిన 28 సెకండ్ల నిడివి గల ఆ బీటీఎస్ వీడియోను ఉపయోగించడం అనేది సినిమాకు సైన్ చేసినప్పుడు నిర్మాత ధనుష్ తో హీరోయిన్ నయనతార చేసుకున్న అగ్రిమెంట్ను ఉల్లంఘించడమే అవుతుందని ధనుష్ న్యాయవాది పిఎస్ రామన్ వాదించారు. అంతేకాకుండా షూటింగ్ సమయంలో నయనతార ధరించిన కాస్ట్యూమ్స్ తో సహా ఈ సినిమాకి సంబంధించిన అన్నీ రైట్స్ ని ధనుష్ సొంతం చేసుకున్నాడని ఆయన వెల్లడించారు.
న్యాయవాది రామన్ మాట్లాడుతూ "సినిమాలోని ప్రతి పాత్రపై, సినిమాకు సంబంధించిన ప్రతి దానిపై కాపీరైట్ ధనుష్ కే చెందుతుందని నయనతార మూవీ చేసే టైమ్ లోనే అగ్రిమెంట్‌పై సైన్ చేసింది. కాబట్టి ఈ సినిమాలో ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ పై కూడా ధనుష్ కు కాపీరైట్ హక్కు ఉంది" అంటూ చెప్పడం సంచలనంగా మారింది.
డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన నెట్ ఫ్లిక్స్
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ నయనతారపై ధనుష్ వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ, రెండు అప్లికేషన్లను మద్రాస్ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ధనుష్ లాయర్ ఇలా కొత్త విషయాలను వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. అయితే 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' బీటీఎస్ సీన్స్ ఉపయోగించుకున్నందుకు ధనుష్ 10 కోట్లు డిమాండ్ చేశాడని సోషల్ మీడియాలో నయనతార బహిరంగంగా వెల్లడించింది. పైగా ధనుష్ తీరుపై విరుచుకుపడింది. దీంతో వివాదం ముదిరింది. నయనతార రాజీకి సిద్ధంగానే ఉన్నప్పటికీ, సోషల్ మీడియా పోస్ట్ లో ఆమె చేసిన కామెంట్స్ పై సీరియస్ గా ఉన్న ధనుష్ మాత్రం పట్టు విడవట్లేదు. మరి ఈ వివాదంలో కోర్టు ఎలాంటి తీర్పు చెపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also : Rashmika Mandanna : ఇంతకన్నా ఏం కావాలి? సంతోషంగా రిటైర్ అవుతా... 'ఛావా' ఈవెంట్లో రష్మిక షాకింగ్ కామెంట్స్





















