Naa Pette Talam Tesi Song: మరీ ఇంత బూతా నితిన్ - ఆ వల్గర్ పాట ఏంటి?
నితిన్ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఓ పాటపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గొడవ ఏంటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
Extra Ordinary Man song controversy: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' శుక్రవారం విడుదల అయ్యింది. సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే... ఈ సినిమాలో ఓ పాట గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నెటిజనులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు, ఆ పాట ఏమిటి? విమర్శలు ఎందుకు? వంటి వివరాల్లోకి వెళితే...
బూతు పాట పెట్టడం ఏమిటి?
అమ్మాయిలతో ఆ స్టెప్పులు ఏమిటి?'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలో ఇంటర్వెల్ తర్వాత 'చమ్మక్' చంద్రతో పోలీస్ స్టేషన్ సన్నివేశం ఉంది. దానికి ముందు రోడ్డు మీద లేడీ కానిస్టేబుల్స్ ఇద్దరితో అసభ్యంగా మాట్లాడటంతో అతనికి హీరో బుద్ధి చెప్పాలని అనుకుంటాడు. తాళం ఉన్నప్పటికీ... లేవని చెప్పి కొట్టడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు 'నా పెట్టి తాళం తీసి' సాంగ్ వస్తుంది. ఆ పాటకు 'జబర్దస్త్' ద్వారా పాపులరైన సత్య శ్రీ (Jabardasth Satya Sri), 'విరూపాక్ష' ఫేమ్, అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసిన సోనియా సింగ్ (Sonia Singh) డ్యాన్స్ చేశారు.
సినిమాలో ఆ పాట అవసరమా? అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అమ్మాయిలతో వేయించిన స్టెప్స్ మీద పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సాంగ్ అవసరం లేదని, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో ఎక్స్‌ట్రాగా యాడ్ చేశారని నిందిస్తున్నారు.
బూతు పాటను నితిన్ ఎలా ఓకే చేశారు?
రికార్డింగ్ డాన్స్, భోగం మేళం వంటివి కొన్నేళ్ల క్రితం వరకు జరిగాయి. వాటిలో ఈ పాట వినిపించేది. కొందరు అసభ్యంగా డ్యాన్స్ చేసేవారు. డబుల్ మీనింగ్ లిరిక్స్, ఆ డ్యాన్స్ పట్ల మెజారిటీ ప్రేక్షకుల్లో చులకన భావం ఉంది. అటువంటి పాట స్టార్ హీరో సినిమాలో కనిపించడంతో పాటు పాటకు ఇద్దరు అమ్మాయిలతో హీరో స్టెప్స్ వేయడం చాలా మందికి నచ్చలేదు.
నితిన్ (Nithin)కు క్లీన్ అండ్ ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. అసలు, ఆయన ఆ బూతు పాటను ఎలా ఓకే చేశారు? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా విడుదలైన రోజు సాయంత్రం యూట్యూబ్‌లో సాంగ్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కొంత సేపటి తర్వాత తొలగించారు. సినిమా కంటే ఈ పాట గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
''నా పెట్టె తాళం తీసి...' అనే ఒక రికార్డింగ్ డాన్స్ పాటని లేడీ కానిస్టేబుల్స్ తో, అదీ పోలీస్ స్టేషన్ లో చండాలమైన సింబాలిక్ షాట్స్ తో, నీచాతి నీచమైన వాంపుల తరహాలో డ్యాన్స్ చేయించి పిక్చరైజ్ చేయటం అసహ్యంగా అనిపించలేదా మేకర్స్?'' అని రేఖా భోజ్ అనే నెటిజన్ పోస్ట్ చేశారు.
Also Read: ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?