తనయుడి సినిమా కోసం బ్రహ్మాజీ పాట్లు.. ఏ ఛాన్స్‌నూ వదులుకోవట్లేగా..!
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ 'స్లమ్ డాగ్ హస్బెండ్' కోసం బాగానే కృషి చేస్తున్నాడు. మూవీకి పబ్లిసిటీ తీసుకువచ్చేందుకు తన వంతు సహకారం అందిస్తూనే వచ్చిన ఏ ఛాన్స్ నూ మిస్ చేసుకోకుండా పని చేస్తున్నాడు
Brahmaji for Slum Dog Husband : నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా నటిస్తోన్న 'స్లమ్ డాగ్ హస్బెండ్' మూవీ ఈ రోజు రిలీజైంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. అయినప్పుటికీ 'స్లమ్ డాగ్ హస్బెండ్' మూవీ టీం మాత్రం తమ సినిమాను మాత్రం ఈ వారాంతంలోనే విడుదల చేసి రిస్కే చేశారు. నిజానికి ఇలాంటి రిస్క్ ఎవరూ తీసుకోరు. కానీ ఈ చిన్న సినిమాను ఈ టైంలో రిలీజ్ చేయడమనేది నిజంగా చెప్పుకోదగిన విషయమనే చెప్పాలి. ప్రముఖ టాలీవుడ్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తనయుడు హీరో సంజయ్ రావ్ ఈ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలన్నీ బ్రహ్మాజే తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీడియాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ తన కొడుకు సినిమాకి పబ్లిసిటీ చేయడంలో తన వంతు కృషి చేస్తున్నాడు బ్రహ్మాజీ.
ఇక ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా మోస్ట్ హ్యాపెనింగ్ నటి శ్రీలీలని తీసుకువచ్చి బ్రహ్మాజీ మూవీకి తాను అందిస్తున్న సహకారాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అంతే కాదు 'పుష్ప 2' సెట్స్‌లో ఉన్న అల్లు అర్జున్‌కి చిత్ర ట్రైలర్‌ను చూపించి అతని నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ వీడియోను సుకుమార్ కు కూడా హామీ కూడా ఇచ్చాడు. దీనికి 'కుక్క మొగుడు' అని పేరు పెట్టాలని రామ్ గోపాల్ వర్మ.. టీమ్‌కి సూచించగా, అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్‌లో తన వంతు సహాయం అందించారు. బ్రహ్మాజీ కొడుకు సినిమాకు నాగార్జున, అలీలు కూడా తమ సపోర్ట్‌ని తెలియజేశారు. ఈ సినిమాకు కావాల్సిన బజ్‌ని తీసుకురావడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలకుండా, తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మాజీ.
'స్లమ్ డాగ్ హస్బెండ్' సినిమా విషయానికొస్తే ఈ మూవీలో ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, సునీల్ తదితరులు నటించారు. కాన్సెప్ట్ విచిత్రంగా, పూర్తిగా వినోదాత్మకంగా ఉండనుదనే టాక్ రాగా... బ్రహ్మాజీ, సప్తగిరి, అలీ వంటి ప్రముఖ నటులు ఈ మూవీలోని హాస్య సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశారు. ఎఆర్ శ్రీధర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించారు. చాలా ప్రమోషన్స్ తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలో ఎంటర్‌టైన్మెంట్ అందించేందుకు సిద్ధమైంది.
ఇక బ్రహ్మాజీ సినిమా విషయాలకొస్తే ఆయన ప్రస్తుతం హీరో మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం', ప్రభాస్ 'సలార్', బాలకృష్ణ 'భగవంత్ కేసరి', 'ఊరి పేరు భైరవకోన', నాగ శౌర్యతో ఓ సినిమాలో కనిపించనున్నారు. ఇక ప్రభాస్ 'సలార్' సినిమాలో ఓ కొత్త క్యారెక్టర్ లో కనిపించనున్న బ్రహ్మాజీ.. ఆయనకు రెండో పార్ట్ లో ఎక్కువగానే కనిపించనున్నట్టు సమాచారం.
Read Also : మీరెందుకు ప్యాకప్ చెబుతారంటూ మోహన్ బాబుతో గొడవపడ్డా: సంగీత దర్శకుడు కోటి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial