అన్వేషించండి

Devara : ఎన్టీఆర్ 'దేవర' తెలుగు రాష్ట్రాల హక్కులు వాళ్ళకే - ఏకంగా అన్ని కోట్లకు డీల్!

Devara : 'దేవర' రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Devara Telugu States Rights : 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ మంచి కమర్షియల్ సక్సెస్ అవడంతో దేవరపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకి అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. ఇదిలా ఉంటే రిలీజ్ కి ముందే ఈ సినిమా థియేట్రికల్, నాన్- థియెట్రికల్ బిజినెస్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇటీవలే 'దేవర' ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకి దక్కించుకుంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది సినిమా రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ తో ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మైత్రీ మూవీస్ వారికే వెళ్లే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే సలార్, హనుమాన్ సినిమాలతో నైజాంలో సక్సెస్ చూసిన మైత్రీ మూవీ మేకర్స్ 'దేవర' తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరితో మైత్రీ మూవీస్ కి మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఇది వాళ్లకి కలిసొచ్చే అంశం అని చెప్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మాణరంగంలోకి అడుగు పెట్టిందే కొరటాల శివ 'శ్రీమంతుడు' సినిమా నుంచి.

ఆ తర్వాత మరోసారి కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్' సినిమాని నిర్మించి సక్సెస్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు తమతో పరిచయం, స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారట. ఈ క్రమంలోనే దేవర తెలుగు రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ రూ.110 కోట్లుకు అడుగుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా.. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న 'దేవర పార్ట్-1' సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read :ఓ మై గాడ్, ఎన్టీఆర్ 'దేవర' కోసం జాన్వీ కపూర్ అంత డిమాండ్ చేసిందా?

టాప్ హెడ్ లైన్స్

Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Embed widget