అన్వేషించండి
Advertisement
Janhvi Kapoor : ఓ మై గాడ్, ఎన్టీఆర్ 'దేవర' కోసం జాన్వీ కపూర్ అంత డిమాండ్ చేసిందా?
Devara : ఎన్టీఆర్ 'దేవర' మూవీ కోసం జాన్వి కపూర్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.
Janhvi Kapoor charging Rs.10 crores for Devara- Here’s the clarity : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ 'ధడక్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిలీ' లాంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన తెలుగు వెండితెరకి ఆరెంగేట్రం చేస్తోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకుంది. తన కూతురు దక్షిణాది సినిమాల్లో కూడా నటించాలనే శ్రీదేవి కోరికను నెరవేర్చేందుకు జాన్వీ.. ఈ ఆఫర్‌ను వెంటనే అంగీకరించింది.
'RRR' సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ మంచి క్రేజ్ సంపాదించిన నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలనేది జాన్వీ కోరిక. ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న భారీ తాను పాన్ మూవీ 'దేవర' లో తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో దేవరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దీంతో 'దేవర' అంతకుమించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రభినయం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోకి అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లింది. కాగా ఈ సినిమాలో జాన్వి కపూర్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే 'దేవర' కోసం ఈ ముద్దుగుమ్మ ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతోందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 'దేవర' చిత్రానికి జాన్వీ కపూర్ రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తుందని, టాలీవుడ్ హీరోయిన్స్ లో హైయిస్ట్ రెమ్యునరేషన్ ఇదే అని మీడియా వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది.
కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. దేవర సినిమా కోసం జాన్వి కపూర్ కి 6 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని మూవీ టీం నుంచి సమాచారం అందింది. దేవర సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు భాగాలకు కలిపి 6 కోట్లు ఇస్తున్నారా? లేక ఒక భాగానికి 6 కోట్లు ఇస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్న ఈసినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
హైదరాబాద్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement