VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్
800 pre release event hyderabad : ప్రముఖ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన '800' సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో చేయనున్నారు.
లెజెండరీ క్రికెటర్, శ్రీలంకకు చెందిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (Muttiah Muralitharan) జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ '800'. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ముత్తయ్య కనుక ఆ టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ్య పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, ఆయన భార్య మదిమలర్ పాత్రలో హీరోయిన్ మహిమా నంబియార్ నటించారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే...
సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్
ముంబైలో '800' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ (800 pre release event)లో చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ఈ నెల 25న... అనగా సోమవారం భాగ్య నగరంలో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి హైదరాబాదీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
Also Read : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!
అక్టోబర్ 6న థియేటర్లలో '800' విడుదల!
వచ్చే నెలలో '800' విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందువల్ల, ప్రచార కార్యక్రమాలు మరింత ముమ్మరం చేశారు. అక్టోబర్ 6న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా '800' (800 Movie) విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ పతాకంపై వివేక్ రంగాచారి ఈ చిత్రాన్ని నిర్మించగా... ఆలిండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) తీసుకున్నారు. ఆయన సమర్పణలో సినిమా విడుదల అవుతోంది.
Also Read : 'బ్రహ్మముడి' సీరియల్ హీరో హీరోయిన్ల మానస్ నాగులపల్లి, దీపికా రంగరాజ్ మధ్య బ్రేకప్
'800'లో క్రికెట్ మాత్రమే కాకుండా ముత్తయ్య మురళీధరన్ జీవితంలో జరిగిన అనేక విషయాలు ఉన్నాయని శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ఆటతో పాటు అందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్నాయని చెప్పారు. తొలుత తన బయోపిక్ తెరకెక్కించడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ముత్తయ్య మురళీధరన్ చెన్నైలో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ''శ్రీపతి పట్టు వీడకుండా శ్రీలంక వచ్చి రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేశాడు. అతని కమిట్మెంట్, కథను రాసిన తీరు చూసి ఓకే చెప్పా. కరోనా వల్ల సినిమా చిత్రీకరణ ఆలస్యమైంది. ప్రజలంతా సినిమా చూస్తారని ఆశిస్తున్నా. సినిమా విడుదల చేస్తున్న శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి థాంక్స్'' అని చెప్పారు.
మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ కెఎల్, ఛాయాగ్రహణం : ఆర్.డి. రాజశేఖర్, సంగీతం : జిబ్రాన్, రచన - దర్శకత్వం : ఎంఎస్ శ్రీపతి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial