అన్వేషించండి

Thaman: తమన్ చేసిన అతిపెద్ద తప్పు - తప్పని ట్రోలింగ్ కష్టాలు!

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై ట్రోలింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన చేసిన ఆ తప్పు వల్లే ఇలా ట్రోలింగ్ చేస్తున్నారంటూ నెట్టింట చర్చ మొదలైంది.

Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ తమన్ కూడా ఒకరు. దాదాపు 15 ఏళ్లుగా టాలీవుడ్ లో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేస్తూ వస్తున్నారు. అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో తమన్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల కాలంలో తమన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయనకు చెడ్డ పేరు తెస్తున్నాయనే టాక్ వస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన పరిస్థితి మరింత ఘోరంగా మారిందనట్లు తెలుస్తోంది. 

తమన్ పై పెరుగుతోన్న ట్రోలింగ్..

తమన్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతం అందించారు. ఆయన సినిమాల్లో చాలా పాటలు ఆల్ టైమ్ ఫేవరేట్ గా నిలిచాయి కూడా. అయితే గత కొన్ని సినిమాల నుంచి తమన్ పై ట్రోలింగ్ పెరుగుతోంది. ఎందుకంటే.. తమన్ ఒకేసారి ఎక్కువ సినిమాలను ఒప్పుకోవడంతో ఏ సినిమాపై కూడా దృష్టి పెట్టలేకపోతున్నాడనేది ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న మాట. సినిమా ఆలస్యం అవ్వడమే కాకుండా ఫైనల్ అవుట్ కూడా సరిగ్గా రావట్లేదట.  అందుకే దీని పట్ల మేకర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం తమన్ చేతిలో వరుసగా  సినిమాలు ఉన్నాయి. ఇదే ఇప్పుడు తమన్ ను ఇరకాటంలో పెడుతోందట. ఈ విషయంపైనే తమన్ ఇప్పుడు అన్నింటా ట్రోలింగ్ కు గురవుతున్నాడు. 

చేతినిండా సినిమాలతో తమన్ సతమతమవుతున్నాడా?

తమన్ చేతినిండా ఉన్నవి అన్నీ భారీ ప్రాజెక్టులే. ప్రస్తుతం ఆయన ‘బ్రో’ సినిమా రీ రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు బోయపాటి-రామ్ కాంబోలో వస్తోన్న సినిమాకు పనిచేస్తున్నారు. అలాగే భారీ స్థాయిలో తెరకెక్కతోన్న ‘గేమ్ చేంజర్’ సినిమాకు పనిచేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్-మహేష్ కాంబో ‘గుంటూరు కారం’ సినిమాకు కూడా తమన్ నే సంగీతం అందిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ఇన్ని సినిమాలకు ఒకేసారి పనిచేయాల్సి వస్తున్నందున తమన్ తీవ్ర ఒత్తిడికి గురవ్వతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభావం ఆయన ఇస్తున్న ట్యూన్స్ మీద పడుతోంది. ఇందుకు ఇటీవల రిలీజైన ‘జానవులే..’ సాంగే నిదర్శనం. ఈ పాట చాలామంది అభిమానులకు నచ్చలేదు.

తమన్ ను సినిమాల నుంచి తప్పిస్తున్నారా?

తమన్ గతంలో పనిచేసిన ‘వీరసింహారెడ్డి’ సినిమాకు కూడా ఇలాగే రీరికార్డింగ్ ను లేట్ చేయడంతో ఆ ప్రభావం మూవీ రిలీజ్ పై పడింది. తాజాగా రామ్ పోతినేని-బోయపాటి ‘స్కంధ’ మూవీ షూటింగ్ పూర్తయినా తమన్ ఒక పాట బ్యాలెన్స్ ఉంచేయడంతో ఆ మూవీ కూడా లేట్ అయ్యేలా ఉందని టాక్. రామ్ ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్ 2’ కోసం లుక్ మార్చేశాడు. మరి మళ్లీ ‘స్కంధ’కు టైమ్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. మరోవైపు ‘బ్రో’ మూవీ రీరికార్డింగ్ విషయంలో కూడా తమన్ పై ఒత్తిడి పడుతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. మరి అనుకున్న టైమ్ లోగా తమన్ రీరికార్డింగ్ పూర్తి చేస్తాడో లేదో చూడాలి. ఇక ‘గుంటూరు కారం’ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ పై మహేష్ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. తమన్ ప్లేస్ లో మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకొచ్చి పని పూర్తి చేయాలని చూస్తున్నారట. ఇప్పటికే తమన్ ను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారని టాక్. మరి ఇన్ని ఒత్తిడిల మధ్య తమన్ ఒప్పందం కుదుర్చుకున్న సినిమాలను పూర్తి చేస్తాడో లేదో చూడాలి.

Also Read: ప్లెక్సీ కడుతూ సూర్య అభిమానులు మృతి - వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget