అన్వేషించండి

ప్లెక్సీ కడుతూ సూర్య అభిమానులు మృతి - వారి కుటుంబాలకు అండగా నిలిచిన హీరో!

కోలీవుడ్ హీరో సూర్య పుట్టినరోజు నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన అభిమానులు ఇద్దరు ఫ్లెక్సీలు కడుతూ మృతి చెందడంతో.. సూర్య తాజాగా వారి కుటుంబాలను సూర్యపరామర్శించారు.

హీరోల పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు చేసే పనులు కొన్నిసార్లు వాళ్ల ప్రాణాలకే ప్రమాదంగా మారుతూ ఉంటుంది. ఇప్పటికే కొందరు అభిమానులు తమ హీరో పై అభిమానాన్ని చాటుకునేందుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనల్ని మనం చూసాం. తాజాగా మరోసారి ఓ స్టార్ హీరో అభిమానులు ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. ప్రముఖ తమిళ హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో తాజాగా ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఇక ఆ యువకుల మృతికి సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ సమీపంలోని మోపు వారి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

సూర్య పుట్టినరోజు సందర్భంగా అతని ముగ్గురు అభిమానులు ఆదివారం తెల్లవారుజామున ఫ్లెక్సీలు కట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న కరెంటు స్తంభం నుంచి షాక్ కొట్టింది. ఫ్లెక్సీ ఇనుప ఫ్రేమ్ కావడంతో ఆ ఫ్లెక్సీ కి పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో వెంకటేష్, సాయి అనే ఇద్దరు యువకులు మృతిచెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా మృతులు సాయి, వెంకటేష్ ఇద్దరూ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకుని చలించిపోయిన సూర్య తాజాగా మృతుల కుటుంబాలను వీడియో కాల్ లో పరామర్శించారు. వాళ్లకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మృతుల్లో ఒకరి సోదరి తను డిగ్రీ చదివానని, ఉద్యోగం ఇప్పించమని కోరగా.. సూర్య తప్పకుండా తన బాధ్యత తీసుకుంటానని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగం తో పాటు వారి కుటుంబాలకి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని చెప్పి వారిలో ధైర్యాన్ని నింపారు.

కాగా ప్రస్తుతం సూర్య 'కంగువ' అనే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యు వి క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదివారం సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లిమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా గ్లిమ్స్ లో విజువల్స్, సూర్య గెటప్, దేవిశ్రీప్రసాద్ బిజిఎం ఓ రేంజ్ లో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశాపటాని హీరోయిన్గా నటిస్తోంది. సినిమాలో సూర్య ఐదు విభిన్న తరహా పాత్రలో కనిపించినట్లు సమాచారం. సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని 2024 ప్రథమార్థంలో విడుదల చేయనున్నారు.

Also Read : రణ్‌వీర్, ఆలియా మూవీలో మమతా బెనర్జీపై వ్యాఖ్యలు, చెత్త డైలాగ్స్‌పై సెన్సార్ వేటు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?
ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?
Special Trains: హైదరాబాద్‌ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్‌ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌
హైదరాబాద్‌ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్‌ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌
Shruti Haasan: ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు
ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు
అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pulivarthi Nani Interview | చంద్రగిరిలో 20ఏళ్ల చరిత్రను ఈసారి తిరగరాస్తా | ABP DesamNallajerla 7Crores Cash Seized | ఎరువుల లారీకి యాక్సిడెంట్..బయటపడ్డ కోట్ల రూపాయల డబ్బు | ABP DesamHindupur Public Talk on Elections 2024 | టీడీపీ కంచుకోటను వైసీపీ !కూలుస్తుందా..? పబ్లిక్ రియాక్షన్ !Hyderabad Old City Public Talk | పోలింగ్ కు కొద్ది గంటల ముందు ఓల్డ్ సిటీ పబ్లిక్ ఫైనల్ రియాక్షన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?
ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?
Special Trains: హైదరాబాద్‌ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్‌ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌
హైదరాబాద్‌ నుంచి ఊరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్- మీ టికెట్‌ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌
Shruti Haasan: ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు
ఆటోలో షూటింగ్ వెళ్లిన శృతి హాసన్ - మరీ ఇంత డెడికేషనా? అంటూ నెటిజన్ల ప్రశంసలు
అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
అవును కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది, పార్టీ వైఖరి మారాలి - రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Ram Charan: పిఠాపురానికి రామ్ చరణ్ - బాబాయ్ తరఫున ప్రచారం చేస్తారా?, ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది!
పిఠాపురానికి రామ్ చరణ్ - బాబాయ్ తరఫున ప్రచారం చేస్తారా?, ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది!
Italy's Birth Rate: దయచేసి పిల్లల్ని కనండి, దేశాన్ని కాపాడుకోండి - ఇటలీ పౌరులకు పోప్ విజ్ఞప్తి
Italy's Birth Rate: దయచేసి పిల్లల్ని కనండి, దేశాన్ని కాపాడుకోండి - ఇటలీ పౌరులకు పోప్ విజ్ఞప్తి
CSK News: ఈ సీజన్‌లో చెన్నై కథ ముగిసినట్లేనా..? ఆర్‌ఆర్‌, ఆర్సీబీ మీద గెలిచే సీన్ ఉందా?
ఈ సీజన్‌లో చెన్నై కథ ముగిసినట్లేనా..? ఆర్‌ఆర్‌, ఆర్సీబీ మీద గెలిచే సీన్ ఉందా?
UP News: తల్లి భార్యను దారుణంగా చంపి, పిల్లలను ఇంటిపై నుంచి తోసి - తరవాత ఆత్మహత్య
UP News: తల్లి భార్యను దారుణంగా చంపి, పిల్లలను ఇంటిపై నుంచి తోసి - తరవాత ఆత్మహత్య
Embed widget