Rockey Aur Rani Ki Prem Kahaani : రణ్‌వీర్, ఆలియా మూవీలో మమతా బెనర్జీపై వ్యాఖ్యలు, చెత్త డైలాగ్స్‌పై సెన్సార్ వేటు!
రణవీర్ సింగ్, కపూర్ ఆలియా భట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకి సెన్సార్ యూనిట్ షాక్ ఇచ్చింది.
బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రణవీర్ సింగ్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాఖి ఔర్ రాణి కి ప్రేమ్ కహాని'. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రణవీర్, ఆలియా ముంబైలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతున్న ఈ సినిమాకి సెన్సార్ యూనిట్ భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. సినిమా రన్ టైం 2 గంటల 48 నిమిషాలు. ఈ క్రమంలోనే సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొన్ని మార్పులు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే సినిమాలో కొన్ని కొన్ని డైలాగ్స్ తో పాటు పదాలను తొలగించాలని సెన్సార్ టీం మూవీ యూనిట్ కి సూచించింది. ఇంతకీ ఆ మార్పులు ఏంటంటే..
1. సినిమాలో చాలా సన్నివేశాలు ఓ అభ్యంతర పదాన్ని వాడగా.. ఆ పదాన్ని వేరే విధంగా మార్చాలని తెలిపింది.
2. 'బ్రా' అనే పదాన్ని ఐటమ్ గా మార్చాలని సెన్సార్ సూచించింది.
3. మద్యానికి సంబంధించిన ప్రముఖ బ్రాండ్ 'ఓల్డ్ మాంక్' అనే పేరుని 'బోల్డ్ మాంక్' గా మార్చాలని పేర్కొంది.
4. సినిమాలో చట్టసభ, మమతా బెనర్జీని ఉద్దేశించేలా ఉన్న సంభాషణలు అన్నిటిని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది.
5. ట్రైలర్ లో చూపించిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటోకి సంబంధించిన సన్నివేశంలో మార్పులు చేయాలని వెల్లడించింది.
కాగా నిర్మాత కరణ్ జోహార్ సుమారు 7 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ చేస్తున్న ఫిలిం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. 2016 లో వచ్చిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా తర్వాత కరణ్ మరో సినిమా తీయలేదు. ఇందులో రణబీర్, కపూర్ అనుష్క శర్మ ఐశ్వర్యరాయ్, ప్రవాద్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఈ సినిమాకి కూడా గతంలో సెన్సార్ పలు కోతలు విధించింది. ముఖ్యంగా సినిమాలో ఏడు సెకండ్లు నిడివి గల ఒక సన్నివేశంలో ఏకంగా 5 కట్స్ విధించింది. అలాగే సినిమా కోసం పాకిస్తానీ నటుడు అయినా ప్రవాద్ ఖాన్ ను తీసుకోవడంపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు 2016 ఉరి(URI) దాడి అమరవీరులను గౌరవిస్తూ ఓ నిరాకరణను చేర్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ మూవీ యూనిట్ కి సూచించింది.
ఇక ఈ సినిమా తర్వాత కరణ్ జోహార్ నుంచి వస్తున్న 'రాఖీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని' సినిమాకి కూడా సెన్సార్ పలు కోతులు విధించడం గమనార్హం. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అనూహ్య రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ప్రకారం.. పంజాబీ కుటుంబానికి చెందిన రాఖి (రణవీర్ సింగ్) బెంగాలీ ఫ్యామిలీకి చెందిన రాణి (అలియా భట్) ప్రేమించుకుంటారు. సాంప్రదాయాలు వేర్వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్లికి ఆసక్తి చూపరు. దీంతో మూడు నెలల పాటు ఒకరి కుటుంబంతో కలిసి మరొకరు జీవించాలని, అలా పెద్దల మనసును గెలిచి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. మరి రాఖీ, రాణీల ప్లాన్ వర్కౌట్ అయిందా? వీళ్ళ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయా? ఇలాంటి తరుణంలో వాళ్లకి ఎదురైన పరిస్థితులేంటి? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ధర్మ ప్రొడక్షన్స్, వయాకాం 18 స్టూడియోస్ పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమా నిర్మించగా.. ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీ కీలక పాత్రలు పోషించారు.
Also Read : 'జవాన్' నుంచి విడుదలైన ఈ మిస్టీరియస్ పిక్ ఎవరిదో తెలుసా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial