Jawan: 'జవాన్' నుంచి విడుదలైన ఈ మిస్టీరియస్ పిక్ ఎవరిదో తెలుసా?
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్' నుండి మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ - కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'జవాన్' మూవీపై ఇప్పటికే అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 'పఠాన్' వంటి సెన్సేషనల్ సక్సెస్ తర్వాత షారుక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి అనూహ్య స్పందన వచ్చింది. ట్రైలర్లో షారుక్ ఖాన్ గుండుతో ఉన్న లుక్, నయనతార క్యారెక్టర్, సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇక తాజాగా మూవీ యూనిట్ మరో పోస్టర్ ని రిలీజ్ చేయగా ఆ పోస్టర్ చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా 'జవాన్' సినిమాకు సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ పోస్టర్లో క్లోజప్ షాట్లో తీసిన ఓ కన్ను కనిపిస్తుంది.
అయితే ఈ పోస్టర్ సినిమాలో ఎవరి పాత్రకు సంబంధించి ఉంటుందంటూ అభిమానులు అప్పుడే సోషల్ మీడియా వేదికగా కనిపెట్టడం మొదలు పెట్టేసారు. ముఖ్యంగా ఈ పోస్టర్ చూసి నెటిజన్స్ అంతా ఫిదా అవుతున్నారు. అయితే మెజారిటీ ఆఫ్ నెటిజన్స్ అయితే ఈ పోస్టర్ లో ఉంది విజయ్ సేతుపతి అని చెబుతున్నారు. కొంతమంది నెటిజన్స్ అయితే 'ఈ ఒక్క లుక్ ప్రాజెక్ట్ K, సలార్ పోస్టర్స్ ని మించి ఉందని' చెప్తుంటే.. 'జవాన్' విలన్ వస్తున్నాడు. పోస్టర్లో ఉంది విజయ్ సేతుపతి. అతని పూర్తి లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో 'జవాన్' న్యూ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. ఇటీవల విడుదలైన జవాన్ ట్రైలర్ లో ఓ షాట్ లో విజయ్ సేతుపతిని చూపించారు.
దీంతో సినిమాలో అతని పాత్ర ఎలా ఉంటుందోనని సినీ ఆడియన్స్ కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార కనిపించనుంది. అంతేకాదు ఈ సినిమాతోనే నయనతార బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. విజయ్ సేతుపతి, ప్రియమణి, సానియా మల్హోత్రా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అలాగే దళపతి విజయ్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్స్ అందుకున్న షారుక్ ఖాన్ కి 'పఠాన్' సినిమా ఊహించని విజయాన్ని అందించి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించింది. మరి 'పఠాన్' తర్వాత వస్తున్న ఈ 'జవాన్' షారుక్ ఖాన్ కి ఆ స్థాయి విజయాన్ని అందిస్తుందా? లేదా అనేది చూడాలి.
He’s watching you closely! Watch out for him.#Jawan pic.twitter.com/CvSJMT5PNE
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 23, 2023
Also Read : డీఎస్పీ గట్టిగా కొట్టాడుగా - ఒక్క దెబ్బకు మళ్ళీ లెక్కలు సెట్ అంతే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial