అన్వేషించండి

Jovika Vijay Kumar: మంజుల మనవరాలు జోవిక... ఎంఎస్ రాజు 'అగధ'లో!

Jovika Vijay Kumar In Agadha: అగ్ర దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'అగధ'. ఈ సినిమాతో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ ను పరిచయం చేస్తున్నారు.

మంజుల గుర్తు ఉన్నారా? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ 'మనుషులంతా ఒక్కటే', 'మగాడు', 'నేరం నాది కాదు ఆకలిది'... నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు 'దొరబాబు', 'బంగారు బొమ్మలు', 'మహాకవి క్షేత్రయ్య', సూపర్ స్టార్ కృష్ణ 'మాయదారి మల్లిగాడు', 'రక్త సంబంధాలు'... శోభన్‌ బాబు 'మంచి మనుషులు', 'పిచ్చి మారాజు' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగులో మాత్రమే కాదు... తమిళ, కన్నడ భాషల్లోనూ అగ్ర కథానాయికగా వెలుగొందారు. ఇప్పుడు ఆమె మనవరాలు వెండితెరపై అడుగు పెట్టేందుకు రెడీ అయ్యారు. 

'అగధ' సినిమాలో మంజుల మనవరాలు!
అగ్ర దర్శక నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా 'అగధ'. ఇందులో మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్ నటిస్తున్నారు. 'దేవి' సినిమాతో మంజుల కూతురు వనితను నటిగా పరిచయం చేశారు ఎంఎస్ రాజు. ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజయ్ కుమార్ ను పరిచయం చేస్తున్నారు.

Also ReadJetlee Twitter Review - 'జెట్లీ' ట్విట్టర్ రివ్యూ: సత్య సినిమాకు మిక్స్డ్ టాక్... కామెడీ కిక్ ఇవ్వలేదా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Adi Varaha Productions (@sriadivarahaproductions)

జోవికా విజయ్ కుమార్‌ (Jovika Vijay Kumar)ను 'అగధ'తో నటిగా పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. ఇందులో హరిణి పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. అలాగే, ఆమె క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేశారు. జోరున కురుస్తోన్న వర్షంలో మసకబారిన పురాతన నేపథ్యంలో జోవికాను చూపించారు. కళ్ళలో అమాయకత్వం, ఆమెలో శక్తి ఉన్నట్టు అర్థం అవుతోంది. 'అగధ' సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదల చేసిన పోస్టర్లు అన్నిటికీ మంచి స్పందన లభించింది. ప్రతి పోస్టర్ కథలోని ఇంటెన్సిటీని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి.

Also ReadKara Review In Telugu - ధనుష్ 'కర' రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… సినిమా ఎలా ఉందంటే?

ఎంఎస్ రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ'ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమా చిత్రీకరణ 85 రోజుల పాటు చేశారు. సినిమాలో దాదాపు 45 నిమిషాల విఎఫ్ఎక్స్ ఉంటాయని తెలిపారు. ప్రేక్షకులకు 'అగధ' ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతి అందిస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని తెరక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందీ సినిమా. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్ వెంకటాపురం, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్. 

Also ReadAlelle Alelle Song Lyrics - 'అలెల్లె అలెల్లె' లిరిక్స్... ట్రెండింగ్‌లో మహేష్ బాబు అన్న కొడుకు సినిమా 'శ్రీనివాస మంగాపురం'లో సాంగ్ - జీవీ సంగీతంలో శ్రీమణి ఏం రాశారంటే?

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Embed widget