News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mrunal Thakur: మృణాల్ కష్టాలు, టాలీవుడ్ మూవీస్ కోసం తెలుగు నేర్చుకుంటున్న ముద్దుగుమ్మ!

‘సీతారామం’ సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్.. తెలుగులో తన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

FOLLOW US: 
Share:

టీనటుల జీవితం టర్న్ అయిపోవడానికి ఒక్క సినిమా చాలు.. ఒక్క హిట్ వారిని మోస్ట్ వాంటెడ్ యాక్టర్ చేయగలదు. అలాగే ఒక్క ఫ్లాప్ వారిని పూర్తిగా వెనక్కి తోసేయగలదు. ప్రస్తుతం అలాంటి ఒక్క హిట్ అందుకొని, కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది మరాఠీ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అసలైతే మృణాల్.. తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది. కానీ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత సక్సెస్‌ను 2022లోనే చూసింది ఈ భామ. ఒక్క తెలుగు సినిమా తన జీవితాన్ని మార్చేయడంతో పాటు మరెన్నో తెలుగు చిత్రాల్లో నటించే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అందుకే తన తెలుగు ఫ్యాన్స్ కోసం ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని మరీ తెగ కష్టపడిపోతోంది మృణాల్.

సీరియల్స్‌ ద్వారా తమ కెరీర్‌ను ప్రారంభించి.. సినిమాల్లో స్టార్లు సెటిల్ అయిపోయిన వారు చాలా తక్కువమంది ఉన్నారు. అలాంటి లిస్ట్‌లో మృణాల్ ఠాకూర్ ఒకరు. ముందుగా హిందీ సీరియల్స్‌లో సైడ్ ఆర్టిస్ట్ రోల్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ భామ. అలాంటి సమయంలోనే మరాఠీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలను కొట్టేసింది. మెల్లగా బాలీవుడ్ దృష్టిలో కూడా పడింది. కానీ మరాఠీ చిత్రాల్లో నటిస్తూ హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకోవడానికి మృణాల్‌కు చాలా సమయం పట్టింది. అయినా కూడా తనకు హిందీ చిత్రాల్లో ముందుగా వచ్చిన అవకాశాలు నటిగా తనకు గుర్తింపును మాత్రం తీసుకురాలేకపోయాయి. ఎన్నో హిందీ చిత్రాల్లో నటించిన తర్వాత తనకు వచ్చిన మొదటి తెలుగు సినిమా అవకాశం.. తనను స్టార్ హీరోయిన్‌ను చేసింది.

‘సీతారామం’లో సీతగా..
తెలుగులో ప్రేమకథలను అందంగా తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి ఒకరు. అలాంటి దర్శకుడు తెరకెక్కించిన అందమైన ప్రేమ కావ్యమే ‘సీతారామం’. ఆ సినిమాలో సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్.. తెలుగులో తన డెబ్యూతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు సీత పాత్ర తనకంటే బాగా ఎవరూ చేయలేరు అనేంతగా ఉంది తన నటన. అలా ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఎంతోమంది తెలుగు మేకర్స్ కూడా తన ఫ్యాన్స్ అయిపోయారు. ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘దేవర’లో మృణాల్.. హీరోయిన్ అంటూ వార్తలు వచ్చినా.. అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. అది కాకుండా ప్రస్తుతం రెండు తెలుగు ప్రాజెక్ట్స్‌తో  మృణాల్.. బిజీగా ఉంది.

నాని, విజయ్ దేవరకొండతో..
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’లో మృణాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వీడి13లో కూడా తనే హీరోయిన్. ఇప్పటికే ‘హాయ్ నాన్న’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొన్నిరోజుల క్రితం నాని పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో ముక్కుపుడకతో, బ్లాక్ శారీలో మృణాల్.. చాలా అందంగా ఉంది. ప్రస్తుతం తన చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉండడంతో ఎలాగైనా తెలుగు నేర్చుకోవాలని నిర్ణయించుకుంది మృణాల్. స్క్రిప్ట్ చేతిలో పట్టుకొని, ల్యాప్‌టాప్ ముందు పెట్టుకొని తెలుగు నేర్చుకోవడం కోసం కష్టపడుతోంది. ప్రస్తుతం మృణాల్.. తెలుగు నేర్చుకోవడానికి కష్టపడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో తన తెలుగు అభిమానులంతా తెగ సంతోషపడిపోతున్నారు.

Also Read: నయనతార ఆస్తుల విలువ అన్ని కోట్లా? కార్లు, ప్రైవెట్ జెట్‌తో పాటు మరెన్నో!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 12 Sep 2023 07:07 PM (IST) Tags: Vijay Devarakonda Mrunal Thakur Sita Ramam Nani Hi Nanna

ఇవి కూడా చూడండి

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

Actor Nagabhushana: కన్నడ హీరో కార్ యాక్సిడెంట్ - పుట్‌పాత్ మీద భార్య మృతి, భర్త పరిస్థితి విషమం 

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

త్రివిక్రమ్ చేతుల మీదుగా పులగం చిన్నారాయణ రచించిన 'జై విఠలాచార్య' పుస్తకావిష్కరణ

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

Ghost Trailer : 'కేజీఎఫ్' ని తలపించేలా 'ఘోస్ట్' ట్రైలర్ - గ్యాంగ్‌స్టర్‌గా శివన్న విధ్వంసం

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

PM Modi In Mahabubnagar:  తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్‌ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'