Mrunal Thakur: ‘ఫ్యామిలీ స్టార్’లో చిరంజీవి, షారుఖాన్, ప్రభాస్ యాక్ట్ చేశారు: మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: 'ఫ్యామిలీ స్టార్'.. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు టీమ్ మొత్తం. దాంట్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు మృణాల్ ఠాకూర్.
Mrunal Thakur About Family Star Movie: విజయ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీగా వస్తున్న సినిమా 'ఫ్యామిలీ స్టార్'. ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది సినిమా. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టింది మూవీ టీమ్. అటు విజయ్ దేవరకొండ, ఇటు మృణాల్ ఇద్దరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దాంట్లో భాగంగా మృణాల్ ఠాకూర్ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. నిజానికి మృణాల్ ఇంటర్వ్యూల్లో చాలా సరదాగా ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లు మాట్లాడేస్తుంటారు. ఇక ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఫన్నీ విషయాలు చెప్పారు ఆమె. యాంకర్ తో ఫన్ క్రియేట్ చేశారు.
షారుక్ ఖాన్, చిరంజీవి, ప్రభాస్ ఉన్నారు..
‘‘ఈ సినిమాలో డిఫరెంట్ క్యామియోస్‌ను చూడబోతున్నాం, రాజు గారు కూడా సినిమాలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి? కొంచెం ఏమైనా లీక్ చేయొచ్చు కదా’’.. అని అడిగిన ప్రశ్నకి మృణాల్ భలే సమాధానం చెప్పారు. "అవును ఈ సినిమాలో షారుక్ ఖాన్, చిరంజీవి, ప్రభాస్, దుల్కర్, సాయి పల్లవి, కమల్ హాసన్ అందరూ ఉన్నారు. నాకు నచ్చిన అందరూ ఈ సినిమాలో కనిపిస్తారు. మీరు కూడా థియేటర్ కి వచ్చి చూడండి. చిరంజీవి గారితో సినిమా చూడటం నాకు ఇష్టమే. ప్రభాస్ గారి కోసం ఈ సినిమా కచ్చితంగా చూడాలి మీరు" అని లీక్ ల గురించి నవ్వుతూ సమాధానం చెప్పారు మృణాల్ ఠాకూర్. "ఇక ఈ సినిమా కోసం నేను చాలా చాలా వెయిట్ చేశాను. షూటింగ్ అయిపోయింది కదా రిలీజ్ చేయండి.. రిలీజ్ చేయండి అని అన్నాను. అంత ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యాను. దానికి పోస్ట్ ప్రొడక్షన్ ఉంది కదా.. మ్యూజిక్ చేయాలి కదా.. డబ్బింగ్ చెప్పాలి కదా అని అన్నారు. నిజానికి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్దాం అనుకున్నాను. కానీ, కుదరలేదు. హిందీలో కచ్చితంగా నేను చెప్తాను" అని చెప్పారు మృణాల్.
ఈ బ్యానర్ లో వర్క్ చేయడం అదృష్టం...
"దిల్ రాజు సార్ తో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియెన్స్. ఇది రెండో సినిమా. జెర్సీ చేశాను. చాలా లవ్లీ ఎక్స్ పీరియెన్స్. ఆయన నాకు నా యశ్ రాజ్, ధర్మ లాగా. గీత గోవిందం లాంటి హిట్ సినిమా తీసిన పరశురామ్, విజయ్ సూపర్ హిట్ జోడీతో రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిజానికి చాలా ప్రజర్ ఫీల్ అవుతున్నాను కూడా. కంపారిజన్స్ జరుగుతాయి కదా అందుకే. ఇక మోహనన్ సార్ డీవోపీ చాలా బాగా షూట్ చేశారు. కల్యాణి పాట చూస్తే మీకు అర్థం అవుతుంది. గోపీ సుందర్ సార్ మ్యూజిక్ కూడా బాగా అనిపించింది. నా బకెట్ లిస్ట్ లో ఒక్కోటి ఫుల్ ఫిల్ అవుతున్నట్లు అనిపించింది. వైజయంతి మూవీస్ లో హీరోయిన్ గా, వెంకటేశ్వర క్రియేషన్స్ తో ఫ్యామిలీ స్టార్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సంతోషంగా ఉంది. ఎగ్జైటెడ్ గా ఉంది. ఈ సినిమాలో డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ టైంలో చాలా ఎంజాయ్ చేశాను. రఘు మాస్టర్‌తో చాలా ఫన్నీగా ఉంటుంది. కల్యాణి సాంగ్.. ప్రాపర్ వెడ్డింగ్ సాంగ్. మీరు ఆ పాట ఎప్పుడు వస్తుందా? అని కచ్చితంగా వెయిట్ చేస్తారు" అని తన ఎగ్జైట్మెంట్, సినిమా గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు మృణాల్.
Also Read: టిల్లన్న డీజే ఈ సారి గట్టిగానే మోగింది - ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే షాకే!