Pushpa 2 Teaser Update: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది - ఆ రోజు డబుల్ ఫైర్‌తో రాబోతున్న 'పుష్పరాజ్', ఫ్యాన్స్‌కి మాస్ జాతరే!
Allu Arjun Pushp 2 Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు.
![Pushpa 2 Teaser Update: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది - ఆ రోజు డబుల్ ఫైర్‌తో రాబోతున్న 'పుష్పరాజ్', ఫ్యాన్స్‌కి మాస్ జాతరే! Most Awaited Pushpa 2 teaser Launch on Allu Arjun Birthday 8th April 2024 Pushpa 2 Teaser Update: అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చేసింది - ఆ రోజు డబుల్ ఫైర్‌తో రాబోతున్న 'పుష్పరాజ్', ఫ్యాన్స్‌కి మాస్ జాతరే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/02/95599bf346bf2ef14e8728a48bfba7d51712055968023929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pushpa 2 teaser Launch on Allu Arjun Birthday: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ఆ అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే అనే విషయం తెలిసిందే. ఈ స్పెషల్ డే రోజున ఫ్యాన్స్ కోసం పుష్ప 2 టీం ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిందా? అని ఫ్యాన్స్ అంత క్యూరియసిటిగా ఉన్నారు. ఈ చిత్రం ఎలాంటి అప్‌డేట్ వస్తందా అని ఆసక్తికగా ఎదుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పుష్ప 2 టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. అంతా ఊహించిననట్టుగానే బన్నీ బర్త్‌డే అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకే మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పుష్ప 2 టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కి మాస్ జాతర చూపించబోతున్నారట. ఇదే విషయాన్ని కన్‌ఫాం చేస్తూ తాజాగా దీనిపై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసింది మూవీ టీం.
Let the #PushpaMassJaathara begin 💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2024
𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥
He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024.
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/GJRREyVF1f
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆసక్తి పెంచుతుంది. కాలుకు గజ్జలు కట్టి కుంకుమతో ఉన్న నెలపై ఒక్క కాలుపై నిలుచుని ఉన్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఇక దీనికి "పుష్ప మాస్ జాతర మళ్లీ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న'పుష్ప 2: ది రూల్' టీజర్ ఏప్రిల్ 8న విడుదల కాబోతుంది. ఆ రోజు పుష్పరాజ్ డబుల్ ఫైర్‌తో రాబోతున్నాడు. వేచి ఉండండి" అంటూ ఈ అప్‌డేట్ ఫ్యాన్స్‌లో క్యూరియసిటి పెంచింది 'పుష్ప 2' టీం. అంతేకాదు ఈ సందర్భంగా మరోసారి రిలీజ్ డేట్ గుర్తుచేశారు. ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' కానుందని స్పష్టం చేశారు. ఇక అప్‌డేట్ చూసి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఆ రోజే మాస్ జాతర.. ఏ రేంజ్‌లో ఉంటుందో!
Pushpa 2 Teaser Upadte: చాలా గ్యాప్ తర్వాత పుష్ప 2 అప్‌డేట్ చూసి బన్నీ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 8న పుష్పరాజ్ మాస్ జాతర ఎలా ఉండబోతుందా? అంతా అంచాలు వేసుకుంటున్నారు. అప్పుడెప్పుడే ఫస్ట్ గ్లింప్స్ వదిలి మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. పుష్పరాజ్ తప్పించుకున్నాడంటూ నానా హడావుడి చూపించారు. ఈ గ్లింప్స్ వచ్చిన నెలల గడుస్తున్న ఇప్పటివరకు పుష్ప 2పై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. అప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ ఆడియన్స్‌ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో బన్నీ బర్త్‌డే సందర్భంగా రాబోతున్న టీజర్‌పై ఓ రెంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. మరి ఆ రోజు 'పుష్ప 2' ఎలాంటి రికార్డు, ఏ రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళి స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ఖైరతాబాద్ RTO ఆఫీసుకి జూనియర్ ఎన్టీఆర్ - ఎందుకో తెలుసా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)