Month Of Madhu : ఆహా ఓటీటీలో నవీన్ చంద్ర, స్వాతిల 'మంత్ ఆఫ్ మధు' - డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?
Month Of Madhu OTT Release Date : స్వాతి రెడ్డి, నవీన్ చంద్ర, శ్రేయా నవేలి ప్రధాన పాత్రల్లో నటించిన 'మంత్ ఆఫ్ మధు' సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Month Of Madhu Aha OTT Release : 'కలర్స్' స్వాతి (Swathi Reddy)గా తెలుగు బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మంత్ ఆఫ్ మధు'. ఇందులో ఆమె ప్రేమికుడిగా, భర్తగా యువ హీరో నవీన్ చంద్ర కనిపించారు. శ్రేయా నవేలి మరో ప్రధాన పాత్ర పోషించారు.
'మంత్ ఆఫ్ మధు' చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న థియేటర్లలో సినిమా విడుదల అయ్యింది. విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కొంత మంది అద్భుతం అంటూ రివ్యూలు రాయగా... మరి కొందరు బాలేదని చెప్పారు. దాంతో బాలేదని చెప్పిన రివ్యూ రైటర్లపై దర్శకుడు విమర్శలు చేశారు. సినిమా అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చేయాలంటూ క్రిటిక్స్ మీద వెటకారంగా కామెంట్స్ చేశారు. నిజానికి, శ్రీకాంత్ నాగోతి తీసిన 'భానుమతి & రామకృష్ణ' సినిమాకు ఓటీటీలో మంచి స్పందన లభించింది. ఇప్పుడీ 'మంత్ ఆఫ్ మధు' సినిమాకు ఓటీటీలో ఎటువంటి స్పందన లభిస్తుందో చూడాలి.
నవంబర్ 3 నుంచి 'ఆహా'లో 'మంత్ ఆఫ్ మధు'
Month Of Madhu Digital Streaming Date : థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ విడుదలకు 'మంత్ ఆఫ్ మధు' సినిమా రెడీ అయ్యింది. నవంబర్ 3 నుంచి తమ ఓటీటీ వేదికలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని ఆహా ఓటీటీ పేర్కొంది. ''కొన్ని సినిమాలు మనసుకు దగ్గరవుతాయి! అలాంటి వాటిలో ఒకటి... మంత్ ఆఫ్ మధు'' అని ఆహా చెబుతోంది. 'భానుమతి & రామకృష్ణ' తరహాలో ఈ సినిమా కూడా ఓటీటీ వీక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
'మంత్ ఆఫ్ మధు' సినిమా కథేంటి?
మధు... మధుసూదన్ రావు (నవీన్ చంద్ర) విశాఖ కుర్రాడు. లేఖ (స్వాతి రెడ్డి) కూడా విశాఖ అమ్మాయే. ఇద్దరూ ప్రేమలో పడతారు. శారీరకంగా ఒక్కటి అవుతారు. దాంతో లేఖ ప్రెగ్నెంట్ అవుతుంది. పెళ్ళికి ముందు గర్భవతి కావడంతో అబార్షన్ చేయించుకుంటుంది. ఆ తర్వాత ఆమె ఇంట్లో విషయం తెలుస్తుంది. గొడవ జరుగుతుంది. అన్నయ్య (రాజా చెంబోలు) చెప్పినా వినకుండా మధును పెళ్లి చేసుకుంటుంది లేఖ.
Also Read : వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి ముహూర్తం ఎప్పుడో తెలుసా? మరి, హల్దీ & మెహందీ టైమింగ్స్?
మధుతో పాటు అతడి కోపాన్ని, మొండితనాన్ని కూడా లేఖ ప్రేమిస్తుంది. అయితే... కొన్ని రోజుల వైవాహిక జీవితం తర్వాత భర్త నుంచి విడాకులు కోరుతుంది. ఆమెకు విడాకులు ఇవ్వడానికి మధు నో చెబుతాడు. అసలు, లేఖ ఎందుకు విడాకులు కోరింది? మధు తాగుడుకు ఎందుకు బానిస అయ్యాడు? అమెరికా నుంచి ఓ పెళ్లి కోసం ఇండియా వచ్చిన మధు... మధుమతి (శ్రేయా నవేలి) ఈ దంపతుల జీవితాల్లో మార్పుకు పరోక్షంగా ఎలా కారణం అయ్యింది? ఇండియాలో నెల రోజులు ఉంటానని తండ్రితో చెప్పిన మధుమతి జీవితంలో ఏం జరిగింది? అనేది సినిమా.
Also Read : ఒకే ఫ్రేములో చరణ్, అర్జున్ - వరుణ్ తేజ్ వెడ్డింగ్ కాక్ టైల్ పార్టీతో పుకార్లకు చెక్!