అన్వేషించండి

Ram Charan Allu Arjun : ఒకే ఫ్రేములో చరణ్, అర్జున్ - వరుణ్ తేజ్ వెడ్డింగ్ కాక్‌ టైల్ పార్టీతో పుకార్లకు చెక్!

Varun Tej Lavanya Tripathi Wedding : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీ ఇచ్చిన కాక్ టైల్ పార్టీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫోటోలు డిస్కషన్ పాయింట్ అవుతున్నాయి. 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... ఇద్దరూ ఒకే వేదికపై కనువిందు చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్టబుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి పెళ్లి సందడి అందుకు వేదిక అయ్యింది. అసలు వివరాల్లోకి వెళితే...

కాక్ టైల్ పార్టీలో చరణ్ అర్జున్!
Varun Tej Lavanya Tripathi Cocktail Party : వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లి సందడి సోమవారం (అక్టోబర్ 30న) మొదలైంది. నిన్న రాత్రి గ్రాండ్ కాక్ టైల్ పార్టీ జరిగింది. అందులో కొత్త జంటతో కలిసి చరణ్, అర్జున్ సందడి చేశారు.

Also Read : లావణ్య త్రిపాఠి పెళ్లి చీర... హల్దీ డ్రస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ఇటలీలో పెళ్లి వేడుకల కోసం కొణిదెల, అల్లు కుటుంబాలు వెళ్ళడానికి ముందు హైదరాబాద్ సిటీలో రెండు పార్టీలు జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఓ పార్టీ జరిగింది. ఆ ఫొటోల్లో అల్లు శిరీష్ కనిపించారు గానీ అల్లు అర్జున్ లేరు. ఆ తర్వాత వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి అండ్ కజిన్స్ అందరిని ఇంటికి పిలిచి అల్లు అర్జున్ మరో పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోల్లో రామ్ చరణ్ కనిపించలేదు. దాంతో కొందరు గాసిప్ రాయుళ్లు ఇద్దరి మధ్య దూరం పెరుగుతోందంటూ కథలు అల్లేశారు. అటువంటి పుకార్లు అన్నిటికీ కాక్ టైల్ పార్టీ ఫోటోలు సమాధానం ఇచ్చాయని చెప్పవచ్చు. 

మూడు రోజుల పెళ్లి వేడుకలో ఇవాళ స్పెషల్ ఏంటంటే?
వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ సమక్షంలో సందడిగా జరగనున్నాయి. ఆల్రెడీ నిన్న రాత్రి కాక్ టైల్ పార్టీ జరిగింది. ఇవాళ హల్దీ, మెహందీ వేడుకలు జరుగుతాయి. బుధవారం (నవంబర్ 1న) ఇద్దరూ ఏడు అడుగులు వేయనున్నారు. 

నవంబర్ 5న హైదరాబాద్ సిటీలో రిసెప్షన్!
పెళ్ళైన నాలుగు రోజులకు కొత్త జంట వరుణ్, లావణ్య హైదరాబాద్ వస్తారు. ఇటలీలో వివాహానికి ఇండస్ట్రీ నుంచి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించడంతో భాగ్య నగరంలో పరిశ్రమ ప్రముఖులకు భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. నవంబర్ 5న జరగబోయే ఆ వేడుకకు ఆల్రెడీ ఆహ్వానాలు పంపారు. ఆ రిసెప్షన్ కంటే ముందు ఇటలీలో పెళ్లైన తర్వాత చిన్న రిసెప్షన్ జరుగుతుందని టాక్. 

Also Read 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Pawan Kalyan Casts his Vote At Mangalagiri | భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్Balakrishna Casts His Vote At Hindupur | హిందూపురంలో ఓటేసిన బాలకృష్ణ | ABP DesamChandrababu naidu Casted Vote | ఉండవల్లిలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు | ABP DesamChiranjeevi Casted Vote With Family | కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
ఆంధ్రప్రదేశ్‌లో 2 గంటల్లో పది శాతం పోలింగ్- పోలింగ్ కేంద్రాల్లో మహిళా ఓటర్ల బారులు
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Telugu News: తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే బారులు తీరిన ఓటర్లు- ఓటు వేసిన ప్రముఖులు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
AP Telangana Weather Updates: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: IMD అలర్ట్
IPL 2024: కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
కోల్‌కత్తాకు చెలగాటం, గుజరాత్‌కు ప్రాణ సంకటం
Amazon: అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
అమెజాన్ మీటింగ్ మిస్టరీ..! ఎంతమంది హాజరైనా ఒక ఖాళీ కుర్చీ ఎందుకంటే?
Relationship Tips : ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
ఆ సామర్థ్యం పెరగాలంటే.. మగవారు, ఆడవాళ్లు తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే
Embed widget