(Source: ECI/ABP News/ABP Majha)
Monkey Man: నేరుగా ఓటీటీల్లోకి ‘మంకీ మ్యాన్’ - ఇక థియేటర్ రిలీజ్ లేనట్టేనా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?
Monkey Man: దేవ్ పటేల్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ఇంకా ఇండియాలోని థియేటర్లలో విడుదల అవ్వలేదు. ఇంతలోనే మూవీ టీమ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Monkey Man Movie: హాలీవుడ్ సినిమాలకు కేవలం హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. అందుకే ఫారిన్ దేశాల్లో విడుదలయిన కొన్నిరోజుల తర్వాత అయినా ఇండియాలో ఆ సినిమాలను విడుదల చేస్తారు. కానీ దేవ్ పటేల్ హీరోగా నటించిన ‘మంకీ మ్యాన్’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ముందుగా అమెరికాలో విడుదలయిన వారం రోజుల తర్వాత ‘మంకీ మ్యాన్’ను ఇండియాలో విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. కానీ అలా జరగలేదు. ఇప్పటికీ ఈ మూవీ ఇండియన్ రిలీజ్‌పై క్లారిటీ లేకపోగా.. ఇండియాలో ‘మంకీ మ్యాన్’కు మరో ఎదురుదెబ్బ తగిలింది.
మరో ఎదురుదెబ్బ..
అమెరికాలో ఏ సినిమా కూడా ఎక్కువరోజులు థియేటర్లలో రన్ అవ్వదు. వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. అలాగే ‘మంకీ మ్యాన్’ కూడా అమెరికాలోని థియేటర్లలో విడుదలయిన కొన్నిరోజులకే ఆన్‌లైన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికీ ఈ మూవీ ఇండియన్ రిలీజ్‌కు క్లారిటీ లేకపోవడం పక్కన పెడితే ఫారిన్‌లో ఆన్‌లైన్‌లో విడుదలయిన హెచ్‌డీ ప్రింట్.. ఇండియన్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావడంతో ‘మంకీ మ్యాన్’ మేకర్స్‌కు ఇక్కడ మరో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ప్రస్తుతం చాలావరకు పైరసీ సైట్లకు ‘మంకీ మ్యాన్’ హెచ్‌డీ ప్రింట్ అందుబాటులో ఉంది. చాలామంది ఈ సినిమాను డౌన్‌లోడ్ చేసుకొని చూసేస్తున్నారు కూడా.
ఇండియాలో ఫ్రీగా..
అమెరికాలో కేవలం రెండు వారాలు పాటు మాత్రమే ‘మంకీ మ్యాన్’ థియేటర్లలో రన్ అయ్యింది. ఈ సినిమాను జార్డన్ పీలే నిర్మించారు. దేవ్ పటేల్ హీరోగా మాత్రమే కాకుండా మొదటిసారి ఈ సినిమా కోసం దర్శకుడిగా కూడా మారాడు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా దేవ్ పటేల్ సక్సెస్ అయ్యాడని చాలామంది యూఎస్ ప్రేక్షకులు పలకరించారు. ‘మంకీ మ్యాన్’ ప్రీమియర్స్ కోసం దేవ్ పటేల్ ఎక్కడికి వెళ్లినా.. అక్కడి ప్రేక్షకులు నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం యూఎస్‌లో అమెజాన్ ప్రైమ్, గూగుల్ ప్లే, యాపిల్ టీవీ, వుడు వంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో ‘మంకీ మ్యాన్’ రెంట్‌కు అందుబాటులో ఉంది. కానీ అప్పుడే ఇండియాలోని పైరసీ సైట్లు దీనిని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకునేలా ఆన్‌లైన్‌లో ఉంచారు.
క్లారిటీ లేదు..
అమెరికాతో పాటు పలు దేశాల్లో విడుదలయిన ‘మంకీ మ్యాన్’.. మొత్తంగా 28.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. దేవ్ పటేల్‌తో పాటు పాల్ ఆంగునవేల, జాన్ కాల్లీ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సాయంగా చేశారు. ఇందులో దేవ్ పటేల్‌కు జోడీగా నటిస్తూ మొదటిసారి హాలీవుడ్‌లో అడుగుపెట్టింది శోభితా ధూళిపాళ. ముందుగా ఏప్రిల్ 5న ‘మంకీ మ్యాన్’ను ఇండియాలో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. కానీ పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా ఈ మూవీ ఇండియన్ రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. షార్ల్టో కోప్లే, సికందర్ ఖేర్, మకరంద్ దేశ్‌పాండే, అశ్విని కల్సేకర్.. ఈ మూవీలో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.