ఈ పండ్లు తింటే.. సమ్మర్‌లో కూల్ కూల్ గా ఉండొచ్చు వడగాలుల తీవ్రత వల్ల.. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్ గా, యాక్టివ్ గా ఉండాలంటే ఈ పండ్లు తింటే మంచిది. ఎండలకు పర్ఫెక్ట్ పుచ్చకాయ. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. దప్పిక తీర్చుతుంది. పైనాపిల్‌లో బ్రొమిలైన్ ఉంటుంది. దాంట్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎండ నుంచి కాపాడతాయి. యాపిల్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. స్ట్రాబెరీస్ కూడా ఎండాకాలంలో తింటే మంచిది. బాడీ హైడ్రేట్ అవుతుంది. కివీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దానివల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. నారింజలో విటమిన్ సీ ఉంటుంది. దానివల్ల బాడీ కూల్ అవుతుంది. హైడ్రేటెడ్ గా ఉంటారు. పీచ్ ఫ్రూట్ లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి మంచి చేస్తుంది.