ఈ ఫుడ్స్‌లో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చు కొన్ని ఆహారాలలో క్యాన్సర్ ను నిరోధించే సమ్మేళనాలు ఉంటాయి. ఆహారం ద్వారా క్యాన్సర్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్యను 75 శాతం తగ్గించింది. అవిసె గింజలు క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుందని న్యూట్రిషన్ జర్నల్ లో పేర్కొన్నారు. కడుపు, ప్రొస్టేట్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో క్యారెట్లు సహాయపడతాయని జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రిక్ జరిపిన అధ్యయనంలో తేలింది. నోటీ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులకు రాస్బెర్రీస్ మేలు చేస్తాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసేర్చ్ లో తేలింది. 30 ఏండ్ల వరకు 30 వేల కంటే ఎక్కువ మంది క్రమం తప్పకుండా డ్రైప్రూట్స్ తింటే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఆలివ్ నూనెను తీసుకునే వ్యక్తుల్లో రొమ్ము, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తగ్గుతుందని జర్నల్ ఆఫ్ ఎపిడేమియాలజీ హెల్త్ పేర్కొంది. స్ప్రింగర్ లింక్ క్యాన్సర్ కంట్రోల్ జర్నల్ లో ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం.. సిట్రస్ పండ్లు తింటే శ్వాస కోశ క్యాన్సర్ తగ్గుతుంది.