ఈ ఫుడ్స్ ఆల్కహాల్ కంటే డేంజర్ మీ లివర్ ఆరోగ్యానికి హాని చేసే ఆల్కాహాల్ కంటే డేంజర్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. తెల్లరొట్టె, బియ్యం వంటి శుద్ధిచేసిన ధాన్యాలతో వండిన ఆహారం కాలేయాన్ని దెబ్బతీస్తాయి. కొన్ని ఫుడ్స్ లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణం అవుతుంది. రెడ్ మీట్ వంటి కొవ్వు అధికంగా ఉండే ఫుడ్స్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతాయి. కాలేయ వ్యాధికి కారణం అవుతాయి. ఫాస్ట్ ఫుడ్ లో అధికంగా అనారోగ్యకరమైన కొవ్వులు, సోడియం, కేలరీలు ఉంటాయి. సోడాలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇందులో కొవ్వు కాలేయాన్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. శీతల పానీయాలలో అధిక చక్కెర్ ఉంటుంది. ఇది కాలేయ ఆరోగ్యానికి హానికరం. హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయ వ్యాధులను ప్రేరేపిస్తాయి.