Ileana Boyfriend: ఇలియానా బిడ్డకి తండ్రి అతడేనా? ఆ ఫొటోలో ఉన్న మిస్టరీ మ్యాన్ ఎవరు?
హీరోయిన్ ఇలియానా ప్రెగ్నెంట్ తో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయం గురించి ఇలియానా సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేసింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ గోవా బ్యూటీ, ఇలియానా ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలియానాకు తొమ్మిదవ నెల. డెలివరీ ఎప్పుడైనా జరగవచ్చు. ఇక ఇలియానా మాత్రం తన మొదటి బిడ్డ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. తన సోషల్ మీడియాలో తరచూ బేబీ బంప్ ని ప్రదర్శిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను నిత్యం అభిమానులతో పంచుకుంటోంది. ఎప్పుడైతే తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని వెల్లడించిందో.. అప్పటినుంచి అభిమానులు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా సైతం తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయం గురించి మెల్లగా తెరదించుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా తన మిస్టరీ మ్యాన్ కి సంబంధించి మరో ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఇలియానా తన భాగస్వామి తన పెంపుడు కుక్కను ఆడిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటోకి 'పప్పీ లవ్'(Puppy Love) అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఇలియానా షేర్ చేసిన ఫోటోలో ఆ వ్యక్తి యొక్క ఫేస్ కనిపించ లేదు. ఈ ఫోటో చూస్తే ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరనేది గుర్తించడం కష్టమే అని చెప్పొచ్చు. దాంతో ఈసారి కూడా ఇలియానా అతని ముఖాన్ని దాచి పెట్టడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఇక మరో పోస్టులో ఇలియానా తన బేబీ బంప్ ని చూపించింది. వంట చేస్తున్న సమయంలో ఈ ఫోటోను తీసి పోస్ట్ చేసింది. దానికి ఓ ఫన్నీ క్యాప్షన్ ఇస్తూ ఈ పోస్టులో తన వంట ప్రతిభ గురించి చెప్పింది. దీంతో ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ పోస్టులు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.
కాగా ఇలియానా ఈ ఏడాది ఏప్రిల్ 18న తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది. అంతే కాదు ఇటీవల ముద్దుగుమ్మ బేబీ మూన్ కు కూడా వెళ్ళింది. అక్కడ చాలా ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పటివరకు ఇలియానా బేబీకి తండ్రి ఎవరినే విషయం మాత్రం స్పష్టం అవలేదు. అయితే ఇలియానా మొదట ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్ చేసి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత కత్రినా కైప్ సోదరుడితో ఆమె సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దానిపై కూడా క్లారిటీ లేదు. ఇలియానా ప్రెగ్నెంట్ అయినట్లు చెప్పడంతో సోషల్ మీడియా అంతా చర్చనీయాంశంగా మారింది. పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు తెలపడంతో తండ్రి ఎవరో చెప్పమంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ తెగ కామెంట్స్ చేశారు.
అయినా కూడా ఇలియానా తాను సహజీవనం చేసిన వ్యక్తి ఎవరో మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. కానీ ఓ సందర్భంలో తల్లి కావడం అనేది గొప్ప విషయమని చెప్పింది ఇలియానా. ‘‘మన శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం గొప్ప అనుభూతి పెంచిందని, అలాగే తనకు కష్టనష్టాల్లో ఒక వ్యక్తి తోడున్నాడని, వేదన నుంచి బయటపడేలా చేశాడని, అండగా నిలిచి జీవితంలో నవ్వులు పూయించాడు’’ అని తెలిపింది. కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. అయితే ఆ వ్యక్తిని తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా కొనియాడింది ఇలియానా. మరి ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరైనా సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
Also Read : 'యానిమాల్' వాయిదా - ఆ సినిమాలకు లైన్ క్లియర్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial