Animal postponed: 'యానిమాల్' వాయిదా - ఆ సినిమాలకు లైన్ క్లియర్
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'యానిమల్' ఆగస్టు రిలీజ్ నుండి తప్పుకోవడం చిరంజీవి 'భోళా శంకర్' కి ప్లస్ గా మారింది.
టాలీవుడ్ యంగ్ ఫిలిం మేకర్, అర్జున్ రెడ్డి మూవీ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో 'యానిమల్' అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పోస్టర్, గ్లిమ్స్ వీడియో తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు చిత్ర యూనిట్. అర్జున్ రెడ్డి ని మించి మోస్ట్ వైలెంట్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలియడంతో ఆడియన్స్ మూవీ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 11, 2023న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు మేకర్స్. అయితే అనూహ్యంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. 'యానిమల్' సినిమాకి సంబంధించి ఇంకా కొంత వర్క్ పెండింగ్లో ఉండటంతో ఈ సినిమాని ఆగస్టు 11న థియేటర్స్ లో తీసుకురావడం కుదరదని మూవీ టీం తేల్చి చెప్పినట్లు సమాచారం.
దీంతో ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ టాక్ ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ఆ నెలలో షారుక్ ఖాన్ 'జవాన్' సినిమా రిలీజ్ ఉండడంతో డిసెంబర్ నెలలో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇంకా ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక 'యానిమల్' రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో ఓ వైపు సినీ ఆడియన్స్ తీవ్ర నిరాశ చెందుతుండగా, మరోవైపు మెగా ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్' కూడా ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది.
అదే రోజు విడుదల కావలసిన 'యానిమల్' మూవీ ఇప్పుడు పోటీ నుంచి తప్పుకోవడంతో ఇది ఒక విధంగా 'భోళా శంకర్' మూవీ టీం కి పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 'యానిమల్' లాంటి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తో 'భోళా శంకర్' పోటీ పడితే అది కాస్త కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో భోళా శంకర్ కి హిట్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ అంతగా రాకపోవచ్చు. కానీ ఇప్పుడు 'యానిమల్' వాయిదా పడటంతో 'భోళా శంకర్' కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఆగస్టు 10న విడుదల కాబోతోంది. కానీ ఈ సినిమాపై పెద్దగా అంచనాలే లేవు. కాబట్టి 'జైలర్' వల్ల 'బోళా శంకర్' కి పెద్దగా ఇబ్బంది ఉండవచ్చు.
దీన్ని బట్టి ఎలాంటి పోటీ లేకుండా ఆగస్టు 11న థియేటర్స్ లో సందడి చేయబోతున్న 'భోళాశంకర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 'భోళా శంకర్' విషయానికొస్తే.. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది. చిరంజీవికి జోడిగా తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. మరో హీరోయిన్ కీర్తి సురేష్ ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహతీ స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Also Read : పూజా హెగ్డే ఎఫెక్ట్, గురూజీని ఆడేసుకుంటున్న నెటిజన్స్ - ‘బ్రో’ టీజరే కారణమట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial