Vrusshabha Release Date : క్రిస్మస్ బరిలో మోహన్ లాల్ 'వృషభ' - బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కు అంతా రెడీ
Mohanlal Vrusshabha : మలయాళ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'వృషభ' ఈ క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Mohanlal's Vrusshabha Release Date Locked : మలయాళ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియా లెవల్ అవెయిటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'వృషభ'. ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా... ఇప్పటికే వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. తాజాగా రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్.
క్రిస్మస్ బరిలో...
క్రిస్మస్ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 25న 'వృషభ'ను గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా అద్భుతమైన విజువల్స్‌తో గ్రాండియర్ లుక్స్‌తో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పించాయి. మూవీలో ఓ యోధుడిగా రాజుగా కనిపించనున్నారు మోహన్ లాల్. గతంలో ఆయన రాజుగా కనిపించగా... తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను హృద్యంగా చూపించారు. ఆయన కొడుకు పాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటించారు.
ఈ మూవీకి నంద కిశోర్ దర్శకత్వం వహించగా... తండ్రీ కొడుకుల మధ్య అందమైన, గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ... ప్రేమ, విధి, ధ్వేషం వంటి ఎమోషన్స్ అన్నీ చూపించినట్లు మేకర్స్ తెలిపారు. మోహన్ లాల్‌తో పాటు సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. మూవీని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె.పద్మకుమార్, వరుణ్ మాథూర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.
Also Read : రాజ్‌తో క్లోజ్‌గా సమంత - డేటింగ్‌పై క్లారిటీ ఇచ్చేసినట్లేనా!... రెండో పెళ్లిపై చర్చ
భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కించగా... గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైం కేటాయించినట్లు తెలుస్తుండగా... అందుకే పలుమార్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది. 'క్వాలిటీ విషయంలో మేము ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా లవర్స్‌కు ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్నదే మా డెడికేషన్. అందుకే సినిమాను క్రిస్మస్ బరిలో తీసుకొస్తున్నాం. ఇది పర్ఫెక్స్ ఫెస్టివల్ గిఫ్ట్ అవుతుంది.' అంటూ మేకర్స్ తెలిపారు.
Some stories are more than cinema, they’re legacies. This Christmas, witness that legacy roar to life in #Vrusshabha.
— Mohanlal (@Mohanlal) November 7, 2025
A film that celebrates emotion, grandeur, and destiny. Releasing worldwide on 25th December 2025.
#RoarOfVrusshabha #VrusshabhaOn25thDecember #SamarjitLankesh… pic.twitter.com/Dq5yPhYHoQ






















